కార్వాన్, జనవరి 9: వోల్వో షోరూంలో రూ.50 లక్షల మోసానికి పాల్పడిన మేనేజర్‌తోపాటు మరో ఐదుగురిని లంగర్‌హౌస్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్ రఘుకుమార్ తెలిపిన ప్రకారం.. రింగ్‌రోడ్‌లో వోల్వో షోరూంలో పాత వాహనాలను కొని విక్రయిస్తుంటారు. సికింద్రాబాద్‌కు చెందిన మహేశ్ ఈ షోరూంలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.
ఇతడు తక్కువ ధరకు వాహనాలు కొని రికార్డుల్లో ఎక్కువ ధర చూపిస్తుంటాడు. సంస్థకు రూ.50 లక్షలు నష్టం చేయ డంతో సీఈఓ కృష్ణప్రసాద్ ఫిర్యాదు మేరకు మహేశ్‌తోపాటు ఐదుగురిని అరెస్ట్ చేశారు.