calender_icon.png 8 October, 2024 | 5:02 AM

గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా

08-10-2024 02:51:48 AM

మార్గదర్శకాలు విడుదల

హైదరాబాద్, అక్టోబర్ 7 (విజయ క్రాంతి) : గల్ఫ్ దేశాల్లో మరణించిన తెలంగాణకు చెందిన కార్మికులకు ప్రభుత్వం రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఎక్స్‌గ్రేషియా పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలు ఎక్స్‌గ్రేషియా పొందాలంటే అర్హులయ్యేందుకు అవసరమైన అంశాలను ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

* మరణించిన గల్ఫ్ కార్మికుడిని భార్య, పిల్లలు లేదా తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యుడిగా నిర్ధారించాలి.

* కేవలం బహ్రెయిన్, కువైట్, ఇరాక్, ఓమన్, ఖతర్, సౌదీ అరేబియా, యూఏఈ దేశాల్లోని కార్మికులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. 

* మరణించిన కార్మికుని మరణ ధృవీకరణ పత్రం తప్పనిసరి, పాస్‌పోర్టు రద్దు చేసి ఉండాలి.

* అర్హులైన వారి బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాలి. 

* బాధితుని కుటుంబ సభ్యులు అవసరమైన పత్రాలన్ని కలెక్టర్‌కు సమర్పిస్తే, కలెక్టర్ దరఖాస్తు పరిశీలించిన అనంతరం ఎక్స్‌గ్రేషియా విడుదల అవుతుంది. 

aఎక్స్‌గ్రేషియా నేరుగా బాధిత కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. 

aగల్ఫ్ దేశాల్లో కార్మికుడు మరణించిన 6 నెలల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.