calender_icon.png 17 January, 2025 | 1:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండు రాష్ట్రాలకు 5 లక్షల చొప్పున సాయం

03-09-2024 12:49:51 AM

సీఎం సహాయనిధికి వెంకయ్య నాయుడు సాయం

  1. స్వచ్ఛంద సంస్థలు వరద బాధితులను ఆదుకోవాలని వినతి
  2. అండగా ఉంటానని ప్రధాని హామీ ఇచ్చినట్లు వెల్లడి

హైదరాబాద్, సెప్టెంబర్ 2(విజయక్రాంతి): ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వరద కష్టాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు. వరదల ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ప్రతిఒక్కరు అండగా నిలవా లని ఆయన విజ్ఞప్తి చేశారు. తన వ్యక్తిగత పెన్షన్ నుంచి రెండు రాష్ట్రాల సీఎం సహా య నిధులకు రూ. 5 లక్షల చొప్పున సాయం అందించినట్లు ఆయన తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి ప్రస్తుత పరిస్థితిని వివరించి, వెంటనే ఆదుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు.

రెండు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడినట్లు... ప్రభుత్వాల యంత్రాంగాలతో, కేంద్ర అధికారులు టచ్‌లో ఉన్నట్లు ప్రధాన మంత్రి చెప్పారన్నారు. రెండు రాష్ట్రాలకు తగిన సహాయ సహకారాలు అందజేస్తామని మోదీ హామీ ఇచ్చారన్నారు. కష్టకాలంలో ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు వెంకయ్య తెలిపారు. వెంక య్య కుమారుడు హర్షవర్ధన్ నిర్వహిస్తున్న ముప్పవరపు ఫౌండేషన్ తరఫున రూ. 2.5 లక్షలు, కుమార్తె దీపా వెంకట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వర్ణ భారత్ ట్రస్ట్ నుంచి మరో రూ.2.5 లక్షల చొప్పున రెండు రాష్ట్రాల సీఎం సహాయ నిధికి సాయం అందించారు.