వికారాబాద్, ఫిబ్రవరి 1: లక్ష డపులు వెయ్యి గొంతుల కార్యక్రమాన్ని పార్టీలకు, సంఘాలకు అతీతంగా విజయవంతం చేయాలని మాదిగ సామాజిక వర్గ యువకులకు పిలుపునిస్తున్నట్టు మంచన్పల్లి సురేష్ తెలిపారు.
వికారాబాద్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో నాయకులు మంచన్ పల్లి సురేష్ మాట్లాడుతూ 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఎస్సీ వర్గీకరణ సాధ్యం కానున్న తరుణంలో ప్రతి ఒక్క మాదిగ సామాజిక వర్గంకు చెందిన వ్యక్తి ఆ విజయంలో పాలు పంచుకోవాలని మంద కృష్ణ మాదిగ కు మద్దతుగా నిలబడాలని పిలుపునిచ్చారు.
చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతివేక్తి భుజాన డపు వేసుకోని కార్యక్రమంలో పాల్గొనాలి అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు టి ఆనంద్,మొరంగపల్లి కృష్ణ, జైపాల్, మాణిక్యం, ఆనంద్, తాండ్ర ప్రవీణ్, గోవర్ధన్, యాదయ్య, కృష్ణ, రవి, అమర్, వెంకటేష్, భాస్కర్, సురేందర్,నర్సిములు తదితరులు పాల్గొన్నారు..