లాస్ ఎంజెల్స్‌లో ఆగని కార్చిచ్చు
10కి చేరిన మరణాల సంఖ్య
ఇళ్లను వీడిన 1.8లక్షల మంది ప్రజలు
మంటల్లో కాలిపోయిన ప్రఖ్యాత బన్నీ మ్యూజియం
వాషింగ్టన్, జనవరి 10: లాస్ ఏంజెల్స్‌లో కార్చిచ్చు బీభత్సం కొనసాగుతోంది. కార్చిచ్చు కారణంగా లాస్ ఏంజెల్స్‌లో మరణించిన వారి సంఖ్య 10కి చేరింది. దాదాపు 10వేల భవనాలు అగ్నికి ఆహుతయ్యాయి.
లాస్ ఏం జెల్స్‌కు ఆరు వైపుల చెలరేగుతున్న మంటలు దాదాపు 38వేలకుపైగా ఎకరాలను దహించి వేశాయి. సన్‌సెట్, వుడ్లీ, ఓలివాస్ ఫైర్‌లను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. పాలిసాడ్స్‌లో చెలరేగిన మంటలను అదుపులోకి తెవడానికి అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 1.8లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
రూ. 12లక్షల కోట్ల నష్టం
కాలిఫోర్నియా చరిత్రలోనే అత్యంత భారీ నష్టాన్ని కార్చిచ్చు కలిగించిందని అక్యూవెదర్ తన నివేదికలో పేర్కొంది. ఇప్పటి వరకు రూ.12లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్టు అం చనా వేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూ జియంగా గుర్తింపు పొందిన అల్టాడేనాలో బన్నీ మ్యూజియాన్ని కార్చిచ్చు కబళించిం ది. దీంతో మ్యూజియంలోని వస్తువులు కాలిపోయాయి.