calender_icon.png 11 October, 2024 | 3:46 PM

రూ.3.5 లక్షల కోట్లు ఆవిరి

01-10-2024 12:00:00 AM

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలుసోమవారం  భారీ నష్టాల్లో ముగిశాయి. గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం, విదేశీ మదుపర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం వంటి కారణాల తో సూచీలు భారీగా పతనమయ్యాయి. ముఖ్యంగా రిలయన్స్, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి సూచీలను పడేశాయి.

సెన్సెక్స్ 1200 పాయి ంట్లకు పైగా నష్టపోగా.. నిఫ్టీ 26 వేల మార్కు ను కోల్పోయి 25,800 స్థాయికి చేరింది. మదుపర్ల సంపద దాదాపు రూ.3.5 లక్షల కోట్లు ఆవిరైంది. బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.474.4 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ ఉదయం 85,208.76 పాయింట్ల (క్రితం ముగింపు 85,571.85) వద్ద నష్టాల్లో ప్రారంభమైంది.

ఆ తర్వాత ఆద్యంతం నష్టాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 84,257.14 పాయింట్ల వద్ద కనిష్ఠానికి చేరిన సూచీ.. చివరికి 1272.07 పాయింట్ల నష్టంతో 84,299.78 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 368 పాయిం ట్లు నష్టపోయి 25,810.85 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 10 పైసలు క్షీణించి 83.80కి చేరింది.

సెన్సెక్స్ 30 సూచీలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ, టాటా స్టీల్, టైటాన్, ఏషియన్ పెయింట్స్ షేర్లు మాత్రమే లాభపడ్డాయి. రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే, టెక్ మహీంద్రా షేర్లు నష్టపోయా యి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 71.64 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 2669 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

కారణాలు ఇవే..

వృద్ధికి ఊతం ఇచ్చేలా చైనా ప్రభుత్వం ఇటీవల చేపట్టిన కొన్ని చర్యలతో విదేశీ మదుపర్లు అటుగా దృష్టి సారించినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే షాంఘై, హాంకాంగ్ మార్కెట్లు సోమవారం రాణించాయి. ఇది మన మార్కెట్లకు నెగిటివ్‌గా మారింది.

పశ్చిమాసియా లో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్త పరిస్థితులు కూడా మదుపర్లను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. లెబనాన్‌పై ఇజ్రాయెల్ విరుచు కుపడుతుండడం ఇందుకు కారణం. ఫెడ్ వడ్డీ రేట్ల కోత ప్రకటన తర్వాత దూసుకెళ్లిన మార్కెట్లకు గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభా ల స్వీకరణకు దిగడం కూడా మరో కారణం గా మార్కెట్ అనలిస్టులు చెబుతున్నారు.