- రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా పద్దులో కేటాయింపులు
- ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజనను ప్రకటించిన ప్రభుత్వం
- దీని ద్వారా 1.7కోట్ల మంది రైతులకు ప్రయోజనం
- కిసాన్ కేడిట్ కార్డు రుణ పరిమితి 5 లక్షలకు పెంపు
- గత బడ్జెట్‌తో పోల్చితే 2.9శాతం కోత
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్ర ప్రభుత్వం తాజాగా బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇచ్చిం ది. గతంలో ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగిస్తూనే కొత్త విధానాలకు శ్రీకారం చుట్టింది. సాగులో ఉత్పాదకత పెంచి దాని ద్వారా రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా పద్దులో కేటాయింపులు చేసింది.
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు కేంద్ర ప్రభుత్వం రూ.1, 71,437 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్ కంటే ఇది సుమారు 15 శాతం ఎక్కువ. 2024-25 ఆర్థిక సంవత్సరం లో వ్యవసాయం దాని అనుబంధ రంగానికి 1.52 లక్షల కోట్లు కేటాయించింది.
పద్దుల కేటాయిం పు సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. కూరగాయాల పెంపకం, పండ్ల ఉత్పత్తితోపాటు లాభదా యకమైన ధరలను అందించ డానికి సమగ్ర కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ఆరేళ్లపాటు కిందులు, మినుములు, మసూర్‌లపై ప్రత్యేకంగా దృష్టిపెట్టను న్నట్టు చెప్పారు.
కంది, మినుములు, మసూర్‌లను కొనుగోలు చేయడానికి ప్రత్యేక కార్యాచరణను రూపొందించనున్నట్టు తెలిపారు. నాఫెడ్, ఎన్‌ఎఫ్‌ఎఫ్‌సీ వంటి జాతీయ సంస్థలు వచ్చే నాలుగేళ్లపాటు పప్పుధాన్యాలను సేకరిస్తాయని పేర్కొన్నారు.
ప్రత్యేక జాతీయ మిషన్‌లు..
రైతుల ఆదాయం పెరగాలంటే తొలుత కావాల్సింది అధిక దిగుబడులు. దీనిపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. పలురకాల పంటల్లో అధిక ఉత్పత్తిని ఇచ్చే వంగడాలను అభివృద్ధి కోసం ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
అలాగే పత్తి ఉత్పాదకత పెంచేందుకు, పత్తి రైతులకు మేలు జరిగే విధంగా దీర్ఘకాలిక లక్ష్యాలతో ప్రత్యేక జాతీయ పత్తి మిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. యూరియా ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించాలని మోదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే యూరియా సప్లు కోసం అస్సాంలో భారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది.
వ్యవసాయశాఖకు తగ్గిన కేటాయింపులు!
రక్షణ రంగం తర్వాత వ్యవసాయ రంగానికే బడ్జెట్‌లో అత్యధిక కేటాయింపులు జరిగినప్పటికీ గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ రంగానికి కేటాయించిన నిధుల్లో 2.9శాతం కోత పడింది. సవరించిన అంచనాల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయశాఖకు రూ. 1.31లక్షల కోట్లు కేటాయించగా ఈ ఆర్థిక సంవత్సంలో మాత్రం రూ. 1.27లక్షలతోనే సరిపెట్టినట్టు తెలుస్తుంది.
2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈరంగంలో మూలధన వ్యక రూ.87.87కోట్లు ఉండగా గతేడాది మాత్రం రూ.118.63కోట్లుగా ఉంది. కాగా దేశ జనాభాలో దాదాపు సగం మందికి ఉపాధి కల్పించే వ్యవసాయ రంగం దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో 16శాతం వాటాను కలిగి ఉంది.
ధన్ ధాన్య కృషి యోజన లక్ష్యాలు
* అధునాతన వ్యవసాయ పద్ధతుల ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం.
* పంటల వైవిధ్యం, స్థిరమైన వ్యవసా య పద్ధతులను ప్రోత్సహించడం.
* వ్యవసాయ ఉత్పత్తులు వృథా కాకుండా నిల్వ సౌకర్యాలను అభివృద్ధి చేయడం.
* వ్యవసాయ ఉత్పత్తులను పెంచడానికి నీటిపారుదల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం.
* రైతలుకు స్వల్ప, దీర్ఘకాలిక రుణాలు పొందేందుకు వీలు కల్పించడం.
దీనికి అదనంగా ప్రభుత్వం గ్రామీణ శ్రేయస్సు, స్థితిస్థాపకత ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా వ్యవసాయంలో ఉపాధి కొరతను పరిష్కరించడానికి ఇది తొడ్పడుతుందని వెల్లడించింది.
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను సృష్టించడం ద్వారా గ్రామీణ మహిళలు, యువరైతులు, సన్నకారు రైతులు, భూమిలేని కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయపడింది. ఈ కార్యకమ్రమాలు సమ్మిళిత వృద్ధిని పెంచడానికి తోడ్పతాయని ప్రభుత్వం భావిస్తుంది.
కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి పెంపు
స్వల్పకాలిక రుణాల కోసం రైతులకు అందించే కిసాన్ క్రెడిట్ కార్డుల(కేసీసీ) పరిమితిని కేంద్ర ప్రభుతం పెంచింది. ఇప్పటి వరకూ రూ.3లక్షల వరకూ ఉన్న రుణ పరిమితిని రూ.5లక్షలకు పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం ద్వారా 7.7కోట్ల మంది లబ్ధిపొందనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
మత్స్యకారులు, రైతులు, పాడి రైతులకు ప్రభుత్వం నిర్ణయం ద్వారా ప్రయోజనం చేకూరుతుందని స్పష్టం చేశారు. దీంతోపాటు బిహార్‌లో మకానా బోర్డును ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజన
తక్కువ ఉత్పాదకత, సగటు కంటే తక్కువ రుణ పరిమితులు ఉన్న దేశంలోని 100 జిల్లాలను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజనను ప్రారంభించినట్టు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాల భాగ స్వామ్యంతో అమలు చేయనున్నట్టు వెల్లడించారు.
ఈ కార్యక్రమం ద్వారా ఎంపిక చేసిన జిల్లాలోని సుమారు 1.7కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. రైతుల ఆధాయం పెరగడంతోపాటు వ్యవసాయ స్థిరత్వాన్ని పెంపొందించ్చవచ్చని వెల్లడించారు.