calender_icon.png 21 January, 2025 | 9:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మౌలిక సదుపాయాల కోసం 11.11 లక్షల కోట్లు

24-07-2024 01:36:49 AM

న్యూఢిల్లీ, జూలై 23: కేంద్ర బడ్జెట్‌లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేశారు. రూ.11.11 లక్షల కోట్లు కేటాయించారు. ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించేందుకు వయబులిటీ గ్యాప్ ఫండింగ్‌ను కూడా కల్పించను న్నారు. రాబోయే ఐదు సంవత్సరాల్లో పరిశ్రమలకు మరింత ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మౌలిక వసతుల కోసం కేటాయించిన రూ. 11,11,111 కోట్లు దేశ జీడీపీలో 3.4శాతానికి సమానం అని తెలిపారు.

పరిశ్రమల అభివృద్ధి ప్రకారం మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం రాష్ట్రాలను ప్రోత్సహిస్తుందని ఆమె పేర్కొన్నారు. రూ.1.5 లక్షల కోట్ల రుణాల ను ఈ ఏడాది కూడా వడ్డీ లేకుండా రాష్ట్రాలకు అందించనున్నట్లు తెలిపారు. అంతే కాకుండా ఈ సారి ప్రైవేట్ సెక్టార్ మౌలిక వసతులను కూడా వయబులిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) ద్వారా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ‘మార్కెట్ ఆధారిత ఫైనాన్సింగ్ ఫ్రేమ్ వర్క్’ను  ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. 

4వ దశ  ‘పీఎంకే’కు శ్రీకారం

దేశ వ్యాప్తంగా 25 గ్రామీణ ఆవాసాలలో 4వ విడత ‘పీఎంకే’ (ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన) ప్రారంభిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. వరదల నియంత్రణ, అందుకు సంబంధించిన ప్రాజెక్టుల కోసం అస్సాంకు సాయం చేయనున్నట్లు కూడా బడ్జెట్‌లో ప్రస్తావించారు. కొద్ది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం మౌలిక వసతుల మెరుగు కోసం చేస్తున్న ప్రయత్నాలను ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చాయని మంత్రి పేర్కొన్నారు. గడిచిన రెండేళ్లుగా ప్రభుత్వం మౌలికరంగానికి ఎక్కువ కేటాయింపులు చేసిందని పేర్కొన్నారు. ప్రైవేటు ఉత్పత్తులు తగ్గినా కానీ 30 శాతం నిధులను ప్రభుత్వం మౌలిక రంగానికి కేటాయించిందని పేర్కొన్నారు. 2020 ఆర్థిక సంవత్సరంలో రూ. 4.39 కోట్లుగా ఉన్న మూలధన వ్యయం తర్వాతి సంవత్సరానికి 35 శాతం పెరిగి రూ. 5.54 లక్షల కోట్లకు చేరినట్లు మంత్రి వెల్లడించారు. అలాగే పెరుగుతూ ప్రస్తుతం రూ. 10 లక్షల కోట్ల కంటే ఎక్కువకు చేరుకుందన్నారు.