calender_icon.png 29 September, 2024 | 10:00 AM

రూ.50 లక్షల నగదు సీజ్

29-09-2024 01:53:21 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): సుల్తాన్ బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పోలీసులకు భారీగా హవాలా డబ్బు పట్టు బడింది. సుల్తాన్‌బజార్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌చారి తెలిపిన వివరాల ప్రకా రం.. సుల్తాన్‌బజార్ పోలీసులు శుక్రవారం సాయంత్రం బొగ్గుల కుంట వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అబిడ్స్ వైపు నుంచి అమిత్ అనే బట్టల వ్యాపారి స్కూటర్‌పై బొగ్గులకుంట వైపు వస్తున్నాడు.

పోలీసులు వాహనాన్ని ఆపి సోదా చేశారు. అమిత్  వద్ద ఉన్న బ్యాగులో రూ.50 లక్షల నగదును గుర్తించారు. నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో సుల్తాన్‌బజార్ పోలీసులు డబ్బును సీజ్ చేశారు. ఇన్‌కం టాక్స్ అధికారులకు సమాచారం అందించగా  ఐటీ అధికారులు నగదును  సీజ్ చేశారు.