calender_icon.png 29 September, 2024 | 9:05 AM

లోక్‌అదాలత్‌లో 9.87 లక్షల కేసులు పరిష్కారం

29-09-2024 02:43:25 AM

హైకోర్టులో 231 కేసులు

హైదరాబాద్, సెప్టెంబర్ 28 (విజక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో శనివారం జరిగిన లోక్‌అదాలత్‌తో 9.87 లక్షల కేసులు పరిష్కారమయ్యాయి. పెండింగ్ కేసులు 5.43 లక్షలు, ప్రాథమిక దశలోనివి 4.44 లక్షలు చొప్పున కేసులు ఉన్నాయి. కక్షిదారులకు రూ.2.22 కోట్లు పరిహారాన్ని ప్రకటించినట్టు రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ పరిపాలనాధికారి జీ కళార్చన తెలిపారు.

కాగా, హైకోర్టులో నిర్వహించిన లోక్‌అదాలత్‌లతో 231 కేసులు పరిష్కారం అయ్యాయి. ఇందులో మోటా రు వాహన చట్టం కింద కేసులు 140, కార్మికుల పరిహారం వివాదానికి సంబంధించిన 28 కేసులున్నాయి. రూ.16.40 కోట్ల పరిహారాన్ని ప్రకటించడం ద్వారా 1,200 మంది లబ్ధి పొందారని హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యదర్శి ఎం శాంతివర్ధని చెప్పారు.

బీమా పరివారానికి సంబంధించిన మూడు కేసుల్లో రూ.2.95 కోట్లు పరిహారం ప్రకటించినట్టు తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జే అనిల్‌కుమార్, మాజీ న్యాయమూర్తి జస్టిస్ జీ శ్రీదేవి కేసులను విచారించారు.