calender_icon.png 12 April, 2025 | 9:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెట్స్‌కు 3.65 లక్షల దరఖాస్తులు

08-04-2025 01:19:53 AM

హైదరాబాద్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): వివిధ కోర్సుల్లో ప్రవేశాల కు నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌లకు భారీగా దరఖాస్తులొచ్చా యి. ఈనెల 7వ తేదీ వరకు ఏడు సెట్స్‌లకు కలిపి మొత్తం 3,65,325 దరఖాస్తులు వచ్చాయి. ఎప్‌సెట్‌కు మొత్తం 2,99,594 దరఖాస్తు లు రాగా, ఇంజినీరింగ్‌కు 2,15,436, అగ్రికల్చర్‌కు 83,916, రెండింటికి కలిపి 242 దరఖాస్తులు వచ్చాయి.

ఈసెట్‌కు మొత్తం 15,516 దరఖాస్తులు అందాయి. ఐసెట్‌కు 15,582, పీజీఈసెట్‌కు 3,979, ఎడ్‌సెట్‌కు 10,486, పీఈసెట్‌కు 635 దరఖాస్తులు వచ్చాయి. ఇక మూడేళ్ల లా సెట్ కోర్సుకు 13,870, ఐదేళ్ల కోర్సుకు 4,125, ఎల్‌ఎల్‌ఎంకు 1,544 దరఖాస్తులందాయి. ఎప్‌సెట్‌కు దరఖాస్తు గడువు ఈనెల 4వ తేదీన ముగియగా, అపరాధ రుసుముతో ఈనెల 24 వరకు సమయ మిచ్చారు. ఈసెట్‌కు ఈనెల 19 వరకు దరఖాస్తు గడువు ఉండగా, ఐసెట్‌కు మే 17, పీజీఈసెట్‌కు మే 19, ఎడ్‌సెట్‌కు మే 13న, పీజీఎల్‌సెట్‌కు ఈనెల 15, పీఈసెట్‌కు మే 24 వరకు గుడువు ఉంది. దరఖాస్తులకు సమయముంటడంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరుగనుంది.