calender_icon.png 24 September, 2024 | 3:52 AM

4.10 లక్షల ఎకరాల్లో వరి సాగు

24-09-2024 01:41:48 AM

11.94 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి 

కొనుగోలు కేంద్రాలకు             8 లక్షల టన్నులు..

నిజామాబాద్ జిల్లాలో 480 కొనుగోలు కేంద్రాలు

నిజామాబాద్, సెప్టెంబర్ 2౩ (విజయక్రాంతి): వానాకాలం సీజన్‌లో నిజామాబాద్ జిల్లాలో 4.10లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. 11.94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్‌లోకి వస్తుందని, రైతుల అవసరాలకు పోను దాదాపు 8 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకోసం జిల్లాలో 480 పైచిలుకు కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. 

85 శాతం రైతులు సన్నరకం 

జిల్లాలో 4.10లక్షల ఎకరాల్లో వరిసాగు కాగా దాదాపు 85 శాతం మంది రైతులు సన్నరకం వరినే సాగు చేశారు. మొత్తం 11.94 లక్షల టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉండగా దాదాపు 3.94 లక్షల టన్నుల ధాన్యం రైతులు తమ సొంత అవసరాలకు వినియోగించుకుంటే మరో 8 లక్షల టన్నుల ధాన్యం ప్రభుత్వ  కొనుగోలు కేంద్రాలకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. క్విం టాలు ఏ ధాన్యానికి రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300 చెల్లించనున్నట్టు అధికారులు తెలిపారు.

ఈ సీజన్‌లో రైతులు పం డించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చే యనున్నట్టు పేర్కొంటున్నారు. అందుకు కొను గోలు కేంద్రాలు సజావుగా సాగేలా నిర్వాహల కు తగు సూచనలు చేయనున్నారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో మౌళిక సదుపాయా లు కల్పించి, తేమ యంత్రాలు, తూకం యంత్రాలు, టార్పాలిన్లు, సరిపడా లారీలు, హమాలీలను సమకూర్చుకోవాలని, ఎగుమతి, దిగుమతలను వెంటవెంటనే జరుపాలని ఆదేశించినట్టు అడిషనల్ కలెక్టర్ కిరణ్‌కుమార్ తెలిపా రు.