calender_icon.png 7 February, 2025 | 10:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘లైలా’ మీ ఛాతీ చపాతీ చేస్తుంది

07-02-2025 01:00:01 AM

విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ‘లైలా’. రామ్‌నారాయణ్ దర్శకత్వంలో  సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న రిలీజ్‌కు సిద్ధమైంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. విశ్వక్‌సేన్ మాట్లాడుతూ.. ‘థియేటర్ల లో నవ్వీ నవ్వీ మీ ఛాతీ చపాతీ కావాలని డిసైడ్ అయ్యాం. కచ్చితంగా లైలా మిమ్మల్ని బాగా నవ్విస్తుంది.

ఈ సినిమా నుంచి నెక్ట్స్ ‘అటక్ పటక్’ రిలీజ్ అవుతుంది. ఆ సాంగ్  నేనే రాశా’ అని చెప్పారు. అనంతరం మీడి యా అడిగిన ప్రశ్నలకు టీమ్ స్పందించింది. ఆ ప్రశ్నలు సమాధానాల సారాంశం ఏంటం టే.. “లైలా’ టార్గెట్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం’ అని డైరెక్టర్ బదులిచ్చారు. ఈ సినిమాకు సంబంధించి మీకు కష్టమనిపించిదేని విశ్వక్‌ను అడిగితే.. 

సాయంత్ర పూట ఇంట్లో ఒక్కడినే ఉండడం కష్టమైంది. ప్యాంట్, షర్ట్ వేసుకుని ఈ గెటప్‌లో బయటకు వెళ్లడం కుదరలేదు. ఈ గెటప్ కోసం రోజూ రెండు గంటలు పట్టేది’ అన్నాడు. హీరోయిన్ కామాక్షి భాస్కర్లను ‘ఈ సినిమాలో మీ రోల్ ఎలా ఉంటుంది?’ అని అడిగితే.. ‘చాలా సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. అందుకే టీజర్, ట్రైలర్‌లో ఎక్కడా చూపించలేదు’ అని చెప్పింది.