09-02-2025 12:00:00 AM
విశ్వక్‌సేన్ యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లైలా’. ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్షశర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత సాహు గారపాటి విలేకరులతో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
“లైలా’ సినిమా కోసం ముందు కొందరు హీరోలను సంప్రదించాం. లేడీ గెటప్ చేయడం అంత ఈజీ కాదు. -ఇలాంటి కథలు వచ్చి చాలా కాలమైయింది. కథ విన్నవెంటనే విశ్వక్ ‘ఇది నేను చేయాల్సిన యాక్టర్’ అని చెప్పారు. -ఫస్ట్ హాఫ్ అంతా సోను ఉంటాడు. అనుకోని కారణంగా లైలాగా మారి ఇన్నోసెన్స్‌ని ప్రూవ్ చేసుకుంటాడు.
ఆ రీజన్ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. -విశ్వక్ లైలా గెటప్ లుక్ పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యిందని అందరూ అంటున్నారు. ట్విట్టర్ అడల్ట్‌తో పోల్చుకుంటే మా సినిమాలో చాలా తక్కువ. హీరో లేడీ క్యారెక్టర్ కొందరికి అర్థం కాని డెక్కన్ లాంగ్వేజ్ మాట్లాడటం వల్ల ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చారు కానీ సినిమాలో ఆడల్ట్ కామెడీ అంటూ ఏమీ లేదు.
రెగ్యులర్‌గా మనం మాట్లాడుకున్నట్లే ఉంటుంది. సినిమా హైదరాబాద్ బ్యాక్ డ్రాప్‌లో ఉంటుంది. మదర్ ఎమోషన్ కూడా హత్తుకునేలా ఉంటుంది. సినిమా అంతా ఫన్ రైడ్‌లా ఉంటుంది. చిరంజీవి కొత్త ప్రయత్నం చేశామని విశ్వక్‌ని మెచ్చుకున్నారు. చిరంజీవి సినిమా మే, జూన్‌లో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ చేస్తాం. మరిన్ని కొన్ని అనౌన్స్ చేయాల్సి ఉంది” అని చెప్పారు.