calender_icon.png 19 November, 2024 | 3:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయం కోసమే ఢిల్లీకి లగచర్ల బాధితులు

19-11-2024 01:45:14 AM

  1. మానవ హక్కుల కమిషన్‌ను న్యాయం కోరతాం
  2. పార్లమెంట్‌లో కాంగ్రెస్, బీజేపీ గొంతెత్తాలి..
  3. రాజ్యసభలో మా పార్టీ గళం విప్పుతుంది..
  4. రేవంత్ అరాచకాలపై రాహుల్ విచారణ జరిపించాలి
  5. ఢిల్లీ మీడియా సమావేశంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, నవంబర్ 18 (విజయక్రాంతి): న్యాయం కోసమే లగచర్ల బాధితు లు ఢిల్లీకి చేరుకున్నారని, జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎదుట వారు తమ గోడు వివరిస్తారని మాజీమంత్రి, బీఆర్‌ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. రైతు లు ప్రాణాలివ్వడానికైనా సిద్ధంగా ఉన్నారని, కానీ.. ఫార్మాసిటీకి భూమలు ఇవ్వలేమని చెప్తున్నారని గుర్తుచేశారు.

లగచర్ల రైతులతో కలిసి సోమవారం ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశం లో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభు త్వం ఎస్టీలపై చేసిన అఘాయిత్యాలు అన్నీ ఇన్ని కావని, వాటిని ఢిల్లీ వేదికగా దేశ ప్రజందరికీ తెలిజేసేందుకే తమ పర్యటన అని స్పష్టం చేశారు. దాదాపు 30 మంది రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, వారు ప్రస్తు తం నడవలేని స్థితిలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

పోలీసులు తమపై దాడి చేశారని జడ్జి ముందు చెబితే మళ్లీ కొట్టి కుటుంబ సభ్యులపై కేసులు పెడతామని బెదిరించారన్నారు. 50 ఏళ్లుగా భూమిపై ఆధార పడి బతుకున్న వారి నుంచి భూములు లాక్కునేందుకు సర్కార్ కుట్రలు పన్నుతున్నదని ఆరోపించారు. లగచర్లలో ఇప్పటికీ కొం దరి మగవారు, పిల్లల ఆచూకీ తెలియడం లేదని, ప్రభుత్వం వారి చెప్పాలని డిమాండ్ చేశారు.

జ్యోతి అనే మహిళ భర్తను పోలీసు లు దారుణంగా కొట్టి అరెస్ట్ చేయడం దారుణమన్నారు. సీఎం అల్లుడి ఫార్మా కంపెనీ కోసం గిరిజనులు ఎందుకు భూములు కోల్పోవాలని ప్రశ్నించారు. ఇవ న్నీ ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీకి ఎందుకు కనిపించడం లేదో అర్థంకావడం లేదన్నారు. ముఖ్య మంత్రి సోదరుడు రైతులను బెదిరిస్తూ, చేస్తున్న అరాచకాలపై ఇప్పటికీ ఒక్క కేసు కూడా లేకపోవడం అరాచకమేనన్నారు.

ఆయనకు ప్రొటోకాల్ ఇచ్చి మరీ కలెక్టర్ స్వాగతం పలుకుతారన్నారు. మణిపూర్‌లో హింసాత్మక ఘటనల కంటే తెలంగాణలో ఎక్కువగానే అరాచకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాజ్యాంగ పరిరక్షణ అంటూ రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని మాటలు చెప్తారని, కానీ.. సీఎం రేవంత్‌రెడ్డి ఆగడాలను మాత్రం ఆపలేకపోతున్నారని విమర్శించారు.

‘రాహుల్ జీ మీరు కొడంగల్ కు రాలేకపోతే, ఢిల్లీలో మీరు మాకు సమయం ఇచ్చేంతవరకు ఇక్కడే ఉంటాం’ అని రైతులు చెబుతున్నారని కేటీఆర్ స్పష్పం చేశారు. ఇప్పటకైనా రాహుల్‌గాంధీ స్పందించి సీఎం రేవంత్‌రెడ్డి తన అల్లుడి కోసం చేస్తున్న భూదందాపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

సీఎం సోద రుడు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని, ఫార్మా విలేజ్‌ను ఆపేది లేదని ఆయన ప్రకటనలు జారీ చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాను ఆయన గుప్పిట్లో పెట్టుకున్నారని ఆరోపించారు.

బీజేపీ, కాంగ్రెస్ నేతలు నోరు విప్పాలి

లగచర్లలో ఎస్టీలకు జరిగిన అన్యాయంపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు పార్లమెంట్‌లో చర్చపెట్టాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ తప్ప కుండా రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తామన్నారు. కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎం గా మారిందని ప్రధాని మోదీ అంటున్నారని, కానీ ఆ ప్రభుత్వంపై మోదీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే గిరిజనుల భూముల లాక్కునే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. తమకు జాతీయ మానవ హక్కుల కమిషన్‌పై నమ్మకం ఉందని, తమకు కమిషన్ ద్వారా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామన్నారు. తమ పోరాటానికి మద్దతు ఇవ్వా లని కోరగా బీఆర్‌ఎస్ బాధితుల పక్షాన నిలిచిందని స్పష్టం చేశారు.

ప్రభుత్వం ఎకరా రూ.60 రూ.70 లక్షల భూమికి రూ.10 లక్షలు ఇస్తామంటున్నదని, ఆ రేటు ఎలా గిట్టుబాటు అవుతుందని ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హయాంలోనూ ఫార్మాసిటీకి దాదాపు 14 వేల ఎకరాల భూమి సేకరించామని, తాము రైతులను ఒప్పించి, మెప్పించి వారికి సరైన పరిహారం ఇచ్చామని గుర్తుచేశారు.

గతంలో తమ ప్రభుత్వం ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తామంటే, ఫార్మాసిటీ విషమంటూ నాడు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి ప్రచారం చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు ఆయన సీఎం హోదాలో అదే విషాన్ని పేద ప్రజల్లో ఊళ్లలో నింపేందుకు పూనుకొంటున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రైట్ అంటే, సీఎం రేవంత్‌రెడ్డి లెఫ్ట్ అనాలనే పాలసీ పెట్టుకున్నారని ఆరోపించారు.

వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఎన్నికల ముందు ప్రకటించిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం తప్ప ఒక్క హామీనైనా అమ లు చేయలేదన్నారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మూఢ నమ్మకాలు నమ్ముతారని, గతం లో రేవంత్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారని, కానీ ఇప్పుడు ఆయన సీఎంగా వాస్తు పేరు తో సచివాలయ గేట్‌ను మార్చుతున్నారని దుయ్యబట్టారు.

తెలంగాణ, కర్ణాటకలో గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందన్నారు. ఈ విషయాన్ని జార్ఖండ్, మహారాష్ట్ర ప్రజలు గుర్తించాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండు మోసపూరిత పార్టీలని, ఆ రెండు పార్టీలను ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరచాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఐదేళ్లు కొనసాగితేనే, తర్వాత బీఆర్‌ఎస్ 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండగలదని జోస్యం చెప్పారు.