calender_icon.png 19 November, 2024 | 2:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లగచర్ల విషయంలో ఏకపక్షం సరికాదు

19-11-2024 02:36:08 AM

సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని

హైదరాబాద్, నవంబర్ 18 (విజయక్రాంతి): లగచర్లలో ఫార్మాసిటీ భూసేకరణ విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకెళ్లడం తగదని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు.

సోమవారం సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు ఎస్.వీరయ్య, జూలకంటి రంగారెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్, అధికారులపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. ఇదే సమయంలో లగచర్లలో పోలీసుల నిర్భందాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. రైతులకు అండగా నిలబడేందుకు ఈనెల 21న వామపక్షాలతో కలిసి లగచర్లకు వెళ్తున్నట్లు చెప్పారు.