calender_icon.png 5 December, 2024 | 1:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాంపల్లి కోర్టుకు లగచర్ల కేసులు

04-12-2024 02:29:31 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): లగచర్ల ఘటనపై నమోదైన కేసులను ఇక నుంచి నాంపల్లి ప్రత్యేక కోర్టులో జరుగనుంది. వికారాబాద్ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గంలోని లగచర్ల గ్రామంలో ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీ భూసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారులపై జరిగిన దాడి  కేసులను వికారాబాద్ సెషన్స్ కోర్టు నుంచి  నాంపల్లిలోని ప్రత్యేక కోర్టుకు బుధవారం బదిలీ చేసింది. ప్రభుత్వ ఆస్తులపై జరిగిన దాడుల కేసు విచారణలు ప్రత్యేక కోర్టులోనే జరగాలని గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు లగచర్ల కేసులను వికారాబాద్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ స్పెషన్స్ కోర్టు నాంపల్లి కోర్టుకు బదిలీ చేసింది. ప్రధాన నింధితుగా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, ఇతర నిందితులకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఇరుపక్షాల వాదనలు ముగ్గిశాయి. లగచర్ల కేసుల విచారణ నాంపల్లి ప్రత్యేక కోర్టు జరగాలని వికారాబాద్ సెషన్స్ కోర్టు జడ్డి ఆదేశించారు. దీంతో మళ్లీ నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేయల్సి ఉంటుంది.