స్మార్ట్ ఫోన్స్ వచ్చాక యువతకు పిచ్చి పీక్స్ కి వెళ్ళిపోయింది. సెల్ఫీ మోజులో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.సెల్ఫీ తీసుకుంటూ చాలా మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా చూశాము. అలాంటి ఘటనే ఇది. సెల్ఫీ తీసుకుంటూ ఓ యువతి అదుపుతప్పి లోయలో పడింది. సెల్ఫీ పిచ్చి యువతి ప్రాణాల మీదికి తెచ్చింది. ఈ ఘటన మహారాష్ట్ర - సతారా జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని బోర్నె ఘాట్‌కు వెళ్లిన స్నేహితులు అక్కడి లోయ దగ్గర సెల్ఫీలు తీసుకునేందుకు యత్నించారు. కాగా, అందులో ఓ యువతి ప్రమాదవశాత్తు జారి 100 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. గమనించిన మిగిలిన మిత్రులు కేకలు వేయడంతో సమీపంలోనే ఉన్న సేఫ్టీ బృందం తక్షణమే స్పందించి యువతిని రక్షించి క్షేమంగా పైకి తీసుకొచ్చింది. ఇలాంటి పిచ్చి పనులు చేయవద్దని రక్షణ బృందం వారిని హెచ్చరించారు.