calender_icon.png 29 September, 2024 | 12:52 AM

లడ్డూ వివాదం బీజేపీ కుట్రే

26-09-2024 03:10:41 AM

  1. టీడీపీ, వైసీపీ కొట్లాటలో లబ్ధి పొందాలని చూస్తోంది 
  2. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి 

హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): తిరుపతి లడ్డూ వివా దంలో వాస్తవాలను చర్చిస్తే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉంటాయని, కానీ మతరపరమైన అం శాలను తెరమీదకు తీసుకొచ్చి వాస్తవాలను మరుగునపడేలా చే స్తున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెం ట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు.

బీజేపీ మాత్రం లడ్డు వివాదం అంశాన్ని రాజకీయ ఎజెండాతో ముందుకు తీసుకెళ్తుందని, ఇందులో ఏపీ సీఎం చంద్రబా బును కూడా భాగస్వా మ్యం చేస్తోందని బుధవారం ఆయన ఒక ప్రకటన లో మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం వాస్తవాలను వెంట నే బయటపెట్టి.. కల్తీలేని లడ్డూలను భక్తులకు అందించాలని జగ్గారెడ్డి కోరారు.

హైదరాబా ద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర ఎంతో ఉందని,  ఆయన్ను తాను ఎంతో అభిమానిస్తానని తెలిపారు. బీజేపీ ఎప్పుడైన ప్రజా సమస్యలను పక్కన పెట్టి మ తపరమైన అంశాల చూట్టూనే రాజకీయం చేస్తోందని, ప్రజలను రెచ్చగొట్టడంలో మొదటి స్థానంలో ఉంటుందన్నారు. వైఎస్సార్  నాయకులు కూడా చంద్రబా బు వయసును గౌరవించాలని, దేశంలో అత్యంత సీనియర్ నేతల్లో ఆయన ఒకరన్నారు.

రాహుల్ నేతృత్వంలోనే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని, పోలవరం ప్రాజెక్టు కూ డా పూర్తి చేస్తారని ఆయన చెప్పారు. టీడీపీ, వైసీపీ కొట్లాటలో బీజేపీ ఎంపీల సంఖ్యను పెంచుకోవాలని చూస్తోందని, ఏపీ సీఎం చంద్రబా బు కూడా తన విజన్‌ను పక్కనబెట్టి పూర్తిగా రాజకీయం చేస్తున్నట్లుగా కనిపిస్తోంద న్నారు.