calender_icon.png 2 April, 2025 | 5:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులపై కొరబడిన పర్యవేక్షణ

14-03-2025 12:00:00 AM

ఆరోగ్యశ్రీ లేకున్నా సౌకర్యం ఉన్నట్లు ప్రచారం

రోగులకు కుచ్చుటోపీ 

చోద్యం చూస్తున్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ

భద్రాద్రి కొత్తగూడెం మార్చ్ 13 (విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రవేటి ఆసుపత్రులపై పర్యవేక్షణ పూర్తిగా కొరబడింది. ఇబ్బడి ముబ్బడిగా ప్రైవేటు ఆసుపత్రులు ఏర్పాటు చేయడం, నిబంధనలకు విరుద్ధంగా ఆర్‌ఎంపీ డాక్టర్లు బెడ్స్ ఏర్పాటు చేసి స్లున్ ఎక్కించడం, ఇంజక్షన్లు వేయడం చేస్తున్నారు. తాజాగా కొంతమంది కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తామని కటౌట్లు బ్యానర్ల ద్వారా ప్రచారం చేసుకుంటున్నారు, అంతటితో ఆగకుండా ప్రభుత్వం నుంచి వచ్చే ఆరోగ్యశ్రీ సౌకర్యం తమ ఆసుపత్రిలో ఉందని, రోగులు ఆరోగ్యశ్రీ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ ప్రచారం చేయటం అధికమైంది. వాస్తవానికి జిల్లాలో కేవలం 9 ఆసుపత్రులకు మాత్రమే ఆరోగ్య సౌకర్యం ఉంది.

జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో గాయత్రి ఆస్పత్రి , షణ్ముఖ ఆసుపత్రికి మాత్రమే ఆరోగ్యశ్రీ సౌకర్యం ఉండగా, తాజాగా వరుణ్ ఆర్థోపెటిక్ వైద్యశాల యాజమాన్యం ఆరోగ్యశ్రీ సౌకర్యం ఉందంటూ ప్రచారం చేసి ప్రజలను మోసం చేస్తున్నట్లు ఆరోపణలు వెలబడుతున్నాయి. ఈ విషయమై ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆరోగ్యశ్రీ మేనేజర్  శ్రీనివాస్ ను వివరణ కోరగా వరుణ్ ఆర్థోపెటుకు ఆరోగ్యశ్రీ సౌకర్యం లేదని, అతను ఆరోగ్యశ్రీ సౌకర్యం ఉన్నట్లు ప్రచారం చేస్తున్నట్లు వచ్చిన  ఫిర్యాదులపై ఇప్పటికే తొలగించాలంటూ హెచ్చరిక చేశామని. తొలగించని పక్షంలో శాఖపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.