calender_icon.png 6 February, 2025 | 3:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కస్తూర్బాలో పర్యవేక్షణ కరువు

06-02-2025 12:00:00 AM

  1. విద్యాలయాలలో సిబ్బంది ఇష్టారాజ్యం
  2. స్థానికంగా ఉండని ఉద్యోగులు పాటించని మెనూ
  3. పట్టించుకోని అధికారులు 

సూర్యాపేట : జిల్లాలోని కస్తూర్బాగాంధీ విద్యాలయాల నిర్వహణలో నిండా నిర్లక్ష్యం పేరుకుపోయింది. అధికారుల పర్యవేక్షణ కూడా సక్రమంగా లేకపోవడంతో అనుకోని దారుణాలు జరుగుతున్నాయి. బడికి దూరంగా ఉన్న ఆడ పిల్లలకు వసతి ఏర్పాటు చేసి విద్యనందించే ఉద్దేశంతో ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి ఈ విద్యాలయాలను నెలకొల్పింది.

పేద కుటుంబాలకు చెందిన పిల్లలు, వివక్షకు గురైన పిల్లలు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. అయితే, నిర్వహణ లోపాలు వారి పాలిట శాపాలుగా మారుతున్నాయి.

జిల్లాలో ఇదీ పరిస్థితి

జిల్లాలో 18 కస్తూర్బా, 1 అర్బన్ రెషిడెన్షియల్ విద్యాలయాలు ఉన్నాయి. వీటిలో గరిడేపల్లి, ఆత్మకూర్(ఎస్), మద్దిరాల, చివ్వెంలలో ఇంటర్మీడియట్ విద్యనం దిస్తున్నారు. వీటన్నింటిలో మొత్తం సుమారు 3,700 మంది విద్యార్థినులు చదువుతున్నా రు. ఒక్కో విద్యాలయంలో ఒక ప్రత్యేక అధికారి, ఏడుగురు అధ్యాపకులు, పీఈటీ, ఏఎన్‌ఎంతో పాటు నలుగురు సిబ్బంది ఉంటారు.

నిబంధనల ప్రకారం ప్రత్యేక అధికారి, అధ్యాపకులు, పీఈటీ, ఏఎన్‌ఎం విద్యాలయంలోనే ఉంటూ సేవలందించాలి. ఉద్యోగ నియామకం సమయంలోనే అధికారులు వీరికి ఈ విషయాన్ని స్పష్టం చేస్తా రు. కాగా తర్వాత ఉద్యోగులు ఏవో కారణాలు చెబుతూ విద్యాలయా లలో ఉండకుండా రాకపోకలు సాగిస్తున్నా రు. దీంతో పర్యవేక్షణ లేక అవాంఛనీయ ఘటన లు చోటు చేసుకుంటున్నాయి.

సమయపాలన వారికి పట్టదు 

నూర్యాపేట మండలం ఇమాంపేటలో కేజీవిబి మైనార్టీ బాలికల పాఠశాల ఉన్నది. ఇందులో ప్రస్తుతం 130 మంది విద్యార్ధినులు ఉన్నారు. ఈ పాఠశాలో బోదన, బోదనేతర సిబ్బంది మొత్తం కలిపి 21 మంది ఉన్నారు. ఈ పాఠశాలలో ఉపాద్యాయులు సమాయపలన పాటించిన రోజులు చాలా తక్కువనే ఆరోపణలు ఉన్నాయి.

పిఈటి ఉపాధ్యాయురాలు సమయానికి వచ్చి విద్యార్థులచే ప్రార్ధన చేయించవలసి ప్రతి రోజు ఆలస్యంగా వస్తుందనే ఆరోపణ ఉన్నది.  పాఠశాల అకౌంటెంట్ తో పాటు ఉపాద్యాయులు ప్రతి రోజు ఆలస్యంగా వస్తుంటారని విద్యార్ధినిలు అంటున్నారు. 

ఏండ్లుగా పని చేయని సీసీ కెమెరాలు.. ప్రహరి లేక ఇబ్బందులు

ఇమాంపేట మైనార్టీ కేజీబివి సూర్యాపేట గరిడేపల్లి రహదారిపై ఉంటుంది. ఈ పాఠశాలో అమర్చిన సీసీ కెమెరాలు దాదాపు రెండు సంవత్సరాలుగా పని చేయడం లేదు. ఈ విషయం పాఠశాల ఉద్యోగులే నిర్ధారిస్తున్నారు. అదే విదంగా పాఠశాల చుట్టూ ప్రహరి గోడ సహితం పూర్తిగా నిర్మించలేదు. ఆడపిల్లల రక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవల్సి ఉందగా పాఠశాలను పట్టించుకునే వారే లేకపోయారు.