calender_icon.png 24 February, 2025 | 3:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లె ప్రకృతి వనంపై అధికారుల పర్యవేక్షణ కరువు

24-02-2025 12:45:13 AM

మోతే,ఫిబ్రవరి 23:- గత ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాల వల్ల పల్లెలో నివసించే ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలనే సంకల్పంతో శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ స్థలాలను గుర్తించి రూ లక్షలు వేచించి ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు ఆనాటి ప్రభుత్వ లక్ష్యం ఆదరణలో నీరుగారిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు పల్లె ప్రకృతి వనాలను పరిశీలిస్తే ఎండిన మొక్క లతో పరిసరాలు ఆహ్లాదానికి విరుద్ధమైన వాతావరణంలో దర్శనమిస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే మోతే మండల పరిధిలోని రాయి కుంట తండా పల్లె ప్రకృతి వనాన్ని చూస్తే అధికారుల చిత్తశుద్ధి స్పష్టమవుతుంది గత ప్రభుత్వ లక్ష్యం నీరుగారిందని చెప్పడానికి చక్కటి నిదర్శనంగా నిలిచింది. విధులకు వచ్చామా వెళ్ళామా అనేలా గ్రామ కార్యదర్శి మల్టీపర్పస్ వర్కర్లు వ్యవహరిస్తున్నట్లు ఈ ప్రకృతి వనాన్ని చూస్తే స్పష్టమవుతుంది పల్లె ప్రకృతి వనం పై అధికారుల పర్యవేక్షణ లోపం ఉన్నత అధికారుల నిర్లక్ష్యంతో నర్సరీలోని మొక్కలు సైతం ఎండిపోవడం గమనార్షం.

కనీసం గేటు తాళం తీసిన దాఖలాలు కూడా కనిపించడం లేదు వాస్తవానికి నర్సరీలోని మొక్కలకు ఎప్పటికప్పుడు నీళ్లు పోస్తూ వాటిని సంరక్షించాల్సి ఉన్నప్పటికీ ఆ దిశలో పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు ఆ గ్రామ ప్రజలకు ఆహ్లాదం మాట దేవుడు ఎరువు కానీ విష సర్పాలకు నిలయంగా మారుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.