24-03-2025 01:05:41 AM
మోతే, మార్చి23:- రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన రాజీవ్ వికాస్ పథకం కోసం దరఖాస్తులు చేసుకోవడానికి మీసేవ కేంద్రాల్లో అప్లై చేసుకున్న వాళ్లు కుల, ఆదా య ధ్రువీకరణ కోసం దరఖాస్తులు చేసుకొని రోజులు గడుస్తున్న మోతే తహసిల్దార్ కార్యాలయంలో సిబ్బంది లేక ఇబ్బందులు పడుతున్నారు.
ఆర్ ఐ లు లేకపోవడంతో ఇంచార్జ్ తహసీల్దార్ శ్రీకాంత్ స్వయంగా గ్రామాల్లోకి వెళ్లి విచారణ చేయవలసిన పరిస్థితి సూర్యాపేట జిల్లా మోతే మండలంలో నెలకొన్నది. రికార్డులు ట్యాంపరింగ్ చేశారని ఆరోపణలతో తహసిల్దార్, ఇద్దరు ఆర్ ఐ లను సస్పెండ్ చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే కొత్త ఆర్ ఐ ను నియామకం చేసి ప్రజల సమస్యలను పరిష్కారం చేయాలని మండలప్రజలు కోరుకుంటున్నారు.