calender_icon.png 15 January, 2025 | 2:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చర్లలో లోపించిన పారిశుద్ధ్యం

08-07-2024 04:27:43 AM

  • రోగాలబారిన పడుతున్న ప్రజలు 
  • పట్టించుకోని పంచాయతీ అధికారులు

చర్ల, జూలై 7: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మేజర్ పంచాయతీ అయిన చర్లలో పారిశుధ్యం అధ్వానంగా మారింది. ప్రజలు రోగాల బారీన పడుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. వర్షాకాలం ప్రారంభమైనా నేటికి మురుగు కాలువలను శుభ్రం చేయలేదు. తాగునీటి పైపులైన్ల మరమ్మతులు చేపట్టలేదు. దోమల నివారణ మందు పిచికారి చేయకపోవడంతో ప్రజలు రోగాల బారీన పడుతున్నారు. గ్రామంలో గల సంత లో మరుగుదొడ్లు లేకపోవడంతో మహిళలు ఇబ్బందు లు పడుతున్నారు. సంత నిర్వాహణలోనూ పారదర్శకత లోపించింది. సంతకు వేలంపాట నిర్వహించిన పంచాయతీ అధికారులు నెలలు గడుస్తున్నా దక్కించుకున్నవారి వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు.

గతేడాది సంత పాట ద్వారా వచ్చిన ఆదాయం, ఖర్చు వివరాలు తెలుపకపోడం అనేక అనుమాలకు తావిస్తోంది. ఆవులు, పందులు రోడ్ల పైనే స్వైర విహారం చేస్తున్నాయి. గ్రామంలో వీధిలైట్లు, చేతిపంపులు మరమ్మతులకు నోచుకోవడం లేదు. రోడ్లపై విచ్చలవిడిగా మాంసం దుకాణాలు ఉండడంతో కుక్కల సంచారం అధికంగా ఉన్నది. అనుమతుల్లేని దుకాణాలు అనేకం ఉన్నాయి. పంచాయతీ రోడ్లను ఆక్రమించుకొంటున్నా పట్టించుకొనే నాథుడే కరువయ్యారు. పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించినా పర్యవేక్షణ లేమీ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.