calender_icon.png 26 March, 2025 | 5:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువు

25-03-2025 07:25:11 PM

బిజెపి నాయకురాలు కృష్ణప్రియ మల్లారెడ్డి..

మేడ్చల్ (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని బిజెపి నాయకురాలు బచ్చు కృష్ణప్రియ మల్లారెడ్డి విమర్శించారు. మహిళలపై అఘాయిత్యాలు జరిగినప్పుడు కఠిన చర్యలు తీసుకోనందున మానవ మృగాలు రెచ్చిపోతున్నాయన్నారు. మేడ్చల్ వస్తున్న రైలులో అత్యాచారయత్నం చేయడం, భయంతో యువతి రైలు నుంచి దూకి తీవ్ర గాయాలు పాలవడం మహిళలను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసిందన్నారు. మహిళలు బస్సుల్లో, రైళ్లలో ఒంటరిగా ప్రయాణం చేయాలంటే భయపడాల్సిన పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడ్డాయన్నారు. రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట నిత్యం మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. నిందితులకు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.