calender_icon.png 16 January, 2025 | 6:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజన, ఆదివాసీలకు రక్షణ కరవు

05-09-2024 01:30:49 AM

బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు డా.కల్యాణ్ నాయక్

హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం లో గిరిజన, ఆదివాసీలకు రక్షణ కరవైందనిబీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు డా.కల్యాణ్ నాయక్ వాపోయారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని జైనూరు మండలంలో ఆదివాసీ మహిళపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా ఆమెను చంపేందుకు యత్నించిన వ్యక్తిని, అతడికి సహకరించిన మరో ముగ్గురిని వెంటనే ఉరి తీయాలని బుధవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. బాధిత మహిళలకు రూ.కోటి నష్టపరిహా రం అందించాలని కోరారు. బాధిత మహిళకు మద్దతుగా, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గురువారం గిరిజన మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నట్లు చెప్పారు.