calender_icon.png 13 February, 2025 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘మార్కెట్’కు ఆదరణ కరువు

13-02-2025 12:00:00 AM

  1. కొండమల్లేపల్లిలో నిరుపయోగంగా దుకాణాలు దుకాణాల్లో విక్రయానికి 
  2. హోల్‌సేల్ వ్యాపారుల నిరాసక్తి ప్రధాన రహదారి వెంట 
  3. మడిగల్లో దందా గిరాకీ లేక వీధి వ్యాపారులు 
  4. సైతం రోడ్డుపైనే విక్రయం

దేవరకొండ, ఫిబ్రవరి 11 : కొండమల్లే పల్లి మండల కేంద్రంలో రూ. లక్షలు వెచ్చించి నిర్మించిన కూరగాయల మార్కెట్ నిరుపయోగంగా మారింది. 2019లో నాటి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇక్కడ రూర్బన్ నిధులు రూ.50 లక్షలతో  శంకుస్థాపన చేసింది. యుద్ధ ప్రాతిపదికన పనులు చేప ట్టి 2021 నాటికి పూర్తి చేసింది.

అదే ఏడా ది  నాటి ప్రజాప్రతినిధులు అట్టాహసంగా కూరగాయ మార్కెట్‌ను ప్రారంభించారు. దాదాపు 60 దుకాణాలను వీధి కూరగా యల వ్యాపారులకు కేటాయించారు. కానీ హోల్‌సేల్ వ్యాపారులు మార్కెట్ యార్డులో కూరగాయల విక్రయానికి  విముఖత వ్యక్తం చేస్తూ ప్రధాన చౌరస్తాలో తమ షాపుల్లోనే విక్రయిస్తున్నారు.

దాంతో కూర గాయలు కొనుగోలు చేసేందుకు జనం మార్కెట్లోకి రాకుండా రోడ్డు వెంట ఉన్న హోల్‌సేల్ దుకాణాల్లోనే కొనుగోలు చేస్తు న్నారు. దీంతో పోటీని తట్టుకోలేక మార్కె ట్లో కూరగాయల దుకాణాలు కేటాయిం చిన వీధి వ్యాపారులు సైతం జాతీయ రహదారి వెంట అమ్మకాలు ప్రారంభించారు.

హోల్‌సేల్ వ్యాపారులను నాటి ప్రభుత్వం మార్కెట్‌లోకి తరలించేందుకు ప్రయత్నించినా ససేమేరా అంటూ కోర్టుకు వెళ్లారు. దాంతో కూరగాయల మార్కెట్ నిరుపయోగంగా మారింది.

నిత్యం ట్రాఫిక్ జామ్..

కొండమల్లేపల్లి పట్టణంలో నాగార్జున సాగర్ -హైదరాబాద్ రహదారికి ఇరు వైపులా వ్యాపారులు కూరగాయలు విక్ర యిస్తుండడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తు తున్నది. ఈ రహదారిపై భారీగా వాహనా ల రద్దీ ఉంటుండడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వాహనాలు అదుపుతప్పి ఢీకొని పాదచారులు గాయ పడిన ఘటనలు ఉన్నాయి.

ఉన్నతాధి కారులు, పోలీసులు చొరవ తీసుకొని వ్యాపారులతో చర్చించి వారిని మార్కెట్‌కు తరలించి లక్షల రూపాయల ప్రభుత్వ ధనంతో నిర్మించిన కూరగాయాల మార్కె ట్‌ను ప్రజలకు అందుబాటులోకి తేవాలని, వినియోగదారుల ఇబ్బందులు తొలగిం చాలని స్థానికులు కోరుతున్నారు. 

ఇబ్బందిపడుతున్నాం..

ప్రధాన రహదారి వెంట కూరగాయలు కొనేందుకు రావాలంటే ఇబ్బందిగా ఉంది. వాహనాలు నిలుపునేందుకు అనువైన స్థలం లేదు. రోడ్డు వెంట కూరగాయలపై దుమ్ము ధూళి నిండిపోతున్నది. ప్రభుత్వం మార్కెట్ నిర్మించినా వ్యాపారులు వాడుకోకపోవడం దుర దృష్టకరం. మార్కెట్‌ను వినియోగంలోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నించాలి.

కుంచాల నాగేంద్ర, కొండమల్లేపల్లి వాసి

వినియోగంలోకి తెస్తాం..

మార్కెట్‌ను వినియోగంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తాం. హోల్ సేల్ వ్యాపారులు కోర్టుకు వెళ్లడంతో ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉంది. వ్యాపారులు సహకరిస్తే వెంటనే మార్కెట్‌ను అందు బాటులోకి తెచ్చేందుకు వీలుంటుంది. ప్రజల ఇబ్బందులను దృష్టి లో ఉంచుకొని వ్యాపారులు సహకరించాలి.                              

బాలరాజురెడ్డి, ఎంపీడీఓ కొండమల్లేపల్లి