ముందుకు సాగని అభివృద్ధి పనులు
కొడంగల్, ఆగస్టు 30: సర్పంచుల పదవీకాలం ముగిసినప్పటి నుంచి పంచాయ తీల్లో పాలన గాడి తప్పుతున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదల కాకపోవడం, పంచాయతీ ఖాతాల్లో డబ్బు లు లేక అభివృద్ధి పనులు ముందుకు సాగ డం లేదు. ఫిబ్రవరి 2వ తేదీతో సర్పంచుల పదవీ కాలం ముగియడంతో పంచాయతీల నిర్వహణ భారమంతా కార్యదర్శులపైనే పడింది. జీపీలకు నిధులు రాకపోవడంతో పారిశుద్ధ్య పనులు, వీధి దీపాల నిర్వహణకు కార్యదర్శులే ఖర్చు చేస్తున్నారు. పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించినా ఇతర పనుల్లో బిజీగా ఉండటంతో గ్రామాలను సందర్శించడంలేదు. వారంలో ఒక్కసారి కూడా గ్రామాలను సందర్శించిన సందర్భాలు లేవు. కార్యదర్శులే ముఖ్యమైన పనులు, సంతకాల కోసం ప్రత్యేకాధికారుల వద్దకు వెళ్తున్నారు.