23-04-2025 01:47:47 AM
- 2 సం. లుగా విడుదల చేయని ప్రభుత్వం
- అవగాహన కార్యక్రమాల నిర్వహణకు అవస్తలు
- ఉమ్మడి మెదక్ జిల్లాలో 318 రైతు వేదికలు...
సిద్దిపేట ఏప్రిల్ 22 (విజయక్రాంతి): రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు క్లస్టర్ వారిగా నిర్మించిన రైతులకు నిధులు లేక నిర్వహణ అధ్వానంగా మారింది. 20 20లో సుమారు 30 లక్షలతో నిర్మించిన రైతువేదికలకు రెండు సంవత్సరాలుగా నిర్వహణకు ప్రభుత్వం నిధులు మంజూరు చే యడం లేదు దాంతో అనేకచోట్ల రైతు వేదికలు మూలనపడ్డాయి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 318 రైతు వేదికలు నిర్మించారు.
మొదట్లో నెలకు మూడు వేల చొప్పున నిర్వహణ కోసం విడుదల చేసిన ప్రభుత్వం ఆ తర్వాత ఖర్చుల మొత్తాన్ని రూ.9వేలకు పెంచింది. రూ. 3 వేలు శానిటేషన్ కు, రూ. 2500 రైతులకు వివిధ అవగాహన కార్యక్రమాలతో పాటు శిక్షణ నిర్వహణ కోసం, వి ద్యుత్ బిల్లు కోసం రూ.1000, స్టేషనరీకి రూ. 1000 చొప్పున, తదితర ఖర్చులకోసం రూ.1500 వినియోగించే విధంగా ప్రభు త్వం ఆదేశాలు జారీ చేసింది.
కానీ 2022లో రూ. 45000 విడుదల చేసి చేతులు దులుపుకున్న ప్రభుత్వం సుమారు రెండు సంవ త్సరాలుగా నిధులు విడుదల చేయకపోవడంతో వ్యవసాయ శాఖ అధికారులు ఇబ్బం దులకు గురవుతున్నారు. రైతులకు కార్యక్రమాలు నిర్వహించలేక, నిర్వహించిన నిర్వహ ణ ఖర్చు భరించలేక ఇబ్బందులకు గురవుతున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
రైతు వేదికలలో ప్రతి మంగళవారం రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించాలని, శిక్షణకు హాజరైన రైతులకు స్నాక్స్ టీ అందించాలని ప్రభుత్వం ఓవైపు ఆదేశిస్తూనే అందుకు అవసరమైన నిధులు ఇవ్వకపోవడం దారుణ మని విమర్శలు వెలువెత్తుతున్నాయి.
రైతు వేదికల నిర్వహణ అధికారులకు భారంగా మారింది కొన్నిచోట్ల అధికారులు రైతు వేదికలను తెరవలేని పరిస్థితి మరికొన్ని చోట్ల అధికారులు జేబులో నుంచి ఖర్చు చేస్తూ రైతులకు అవసరమైన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ విషయంపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాధికను వివరణ కోర గా నిధులు విడుదల కాలేదని వివరించారు. క్షేత్రస్థాయిలో రైతు వేదికల పరిస్థితులను ఇదివరకే జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపించామని తెలిపారు. నిధులు విడుదల కాగానే సంబంధిత అధికారులకు అందజేస్తామని వెల్లడించారు.