calender_icon.png 19 April, 2025 | 8:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధి హామీ కూలీలకు సౌకర్యాల లేమి

16-04-2025 06:27:38 PM

జుక్కల్ (విజయక్రాంతి): ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు సౌకర్యాల లేమి స్పష్టంగా కనిపిస్తోంది. ఉదయం ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీలకు 11 గంటలు కాగానే 12 గంటల వరకు ఎండ తీవ్రత అధికమవడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. ప్రభుత్వం తరఫున వారికి వసతి సౌకర్యాలు కల్పించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గతంలో ఉపాధి హామీ కూలీలకు టెంట్లు నేటి సౌకర్యం తాటిపత్రిలు లాంటివి ఏర్పాటు చేసే వారిని వీటితో పాటు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కూడా అక్కడ ఉంచేవారని పేర్కొంటున్నారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితిలేమీ కనిపించడం లేదని ఎండలో పనులు చేసుకుంటూ ఇంటికి నడుచుకుంటూ రావలసిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు.

గతంలో లాగా ప్రస్తుతం రోజు వారి కూలి కూడా తక్కువగానే వస్తుందని దీంతోపాటు కూలి గిట్టుబాటు కావడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జుక్కల్ మండలంలో మొత్తం సుమారు 5000 మంది కూలీలకు జాబ్ కార్డులు ఉండగా అందులో గ్రామానికి 30 నుంచి 40 మంది మాత్రమే హాజరవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అంటే ఈ లెక్కన కూలీలు సగానికి సగం మందే పనులకు వాడుతున్నట్లు తెలుస్తోంది. మిగతా సగం మంది కూలి పనులకు వాడడం లేదని పేర్కొంటున్నారు. కొందరి పనికి వెళ్లకుండా మాస్టర్ రోల్లో పేర్లు నమోదు అవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు పనికి వెళ్లిన ఫోటోలు సరిగా రాలేదని మాస్టర్ రోల్లో పేరు రాలేదని డబ్బులు రావు అంటూ తమకు సంబంధిత అధికారులు చెబుతున్నట్లు ఆవేదన చెందుతున్నారు. ఇటీవల వారం రోజుల క్రితం తమకు గత రెండేళ్ల నుంచి ఉపాధి హామీ పనులే కల్పించలేదంటూ ఓ గ్రామానికి చెందిన సుమారు 50 మంది మహిళలు ఎంపీడీవో కార్యాలయాన్ని చుట్టుముట్టారు.

ఈ విషయం తెలుసుకున్న ఉపాధి హామీ ఎపిఓ ఎంపీడీవోలు వచ్చి వారికి ఏదో ఒకటి చెప్పి నచ్చజెప్పి పంపినట్లు తెలిసింది. అయితే ఈ సమస్య చాలా గ్రామాల్లో ఉందని కూడా ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్నారు. ఇలాంటివి ఎన్నో ఉన్నప్పటికీ కూలీలకు సరైన పనులు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నట్లు తెలుస్తోందని దీన్నిబట్టి ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ప్రతిరోజు ఎంపీడీవో పర్యవేక్షణ చేసినప్పటికీ ఉపాధి హామీ అధికారులు నామమాత్రంగా నీ పనులు చేపిస్తున్నారని ఆయా గ్రామస్తులు కోరుకుంటున్నారు. ఉపాధి హామీ కూలీలు కూడా వందమందికి 50 మంది వచ్చి కొద్ది కొద్దిగా పనులు చేయడంతో టి ఏ లు వచ్చి మెజర్మెంట్ చేసినప్పుడు కూలి తక్కువగా వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి కన్ఫ్యూజన్లో అధికారులకు నమ్మాలా లేకుంటే ఉపాధి హామీ కూలీలు చెప్పే మాటలు నమ్మాలా అనే సందిగ్ధం నెలకొంది. ఏదేమైనా ఉపాధి హామీ కూలీల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.