calender_icon.png 22 February, 2025 | 3:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైనిక్ స్కూల్‌లో తప్పిన క్రమశిక్షణ

22-02-2025 01:52:32 AM

*పదవ తరగతి విద్యార్థులను చితకబాదిన ఇంటర్ విద్యార్థులు 

*ఆందోళన చేపట్టిన విద్యార్థుల తల్లిదండ్రులు

కరీంనగర్, ఫిబ్రవరి21(విజయక్రాంతి): క్రమశిక్షణ, దేశభక్తి పెంపొందించవలసిన సైనిక్ స్కూల్ నేడు రణరంగంగా మారి.  పలుమార్లు సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులపై దాడులు జరపడం రౌడీయిజాన్ని తలపిస్తుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురవుతున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండ ల పరిధిలోని రుక్మాపూర్ సైనిక్ స్కూల్లో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది.

విద్యార్థుల తల్లిదండ్రుల వివరాల మేరకు గురువారం రాత్రి సైనిక్ స్కూల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులు పదవ తరగతి విద్యార్థు లను చితకబాదిన సంఘటన లో పదవ తరగతి విద్యార్థుల్లో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలై ఆసుపత్రి పాలయ్యారు. ఈ మేరకు ముగ్గురు విద్యార్థుల్లో ఒకరి చేతి వేళ్ళు విరిగినట్లు తెలిసింది. మరో ఇద్దరికి శరీరంపై తీవ్ర గాయాలై నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొన్నారు.

గత పది రోజుల క్రితం ఏడవ తరగతి విద్యార్థి పై కూడా దాడి జరగగా తీవ్ర గాయాలు కావడంతో విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన దిగి ఇంటికి విద్యార్థిని తీసుకు వె ళ్లినట్లు తల్లిదండ్రులు పేర్కొ న్నారు. కాగా గతంలో కూడా ఇంటర్ విద్యార్థులు పదవ తరగతి విద్యార్థులపై దాడి జరిపిన సంఘటనలు ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయని వాటిపై ఎలాంటి చర్యలు కూడా తీసుకోకుండా విద్యార్థులను ఇలాంటి సంఘటనలకు పా ల్పడే విధంగా పరోక్షంగా పాఠశాల నిర్వాహకులే ప్రోత్సహిస్తూ ఉన్నట్లు ఉందని విద్యా ర్థుల తల్లిదండ్రులు ఆరోపించారు.

దేశ రక్షణకు రక్షణగా నిలబడే విధంగా ఎంతో క్రమశిక్షణతో కూడిన విద్యార్థులను తయారు చేసే కేంద్రంగా ఏర్పడిన ఈ రుక్మాపూర్ సైనిక్ స్కూల్లో ఇలాంటి సంఘటనలు పలుమార్లు చోటుచేసుకుండడంతో పాఠశాల వాతావరణం రౌడీయిజం ను తలపి స్తుందని పలువురు విమర్శించారు. ఆందోళనకు దిగిన విద్యార్థుల తల్లిదండ్రులు నిర్వా హకులను ప్రశ్నిస్తూ మా పిల్లలకు ఇక్కడ రక్షణ ఉందా? ఉంటే ఇలాంటి సంఘటనలు ఎందుకు పునరావృతం అవుతున్నాయం టూ నిలదీశారు.

రక్షణ కల్పించాల్సిన మీరు విద్యార్థు దాడులు చేసుకుంటుంటే మీరు ఏం చేస్తున్నట్లు, ఇలాంటి సంఘటనలో మా పిల్లల ప్రాణాలకు రక్షణ కరువైందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మా పిల్లలకు జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అంటూ ప్రశ్నించారు.  విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నల వర్షం కురిపించడంతో నిర్వా హకులు బిత్తర పోయారు. మరోసారి ఇలాంటి సంఘటనలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అంటూ నిలదీయగా తానే బాధ్యత వహిస్తానంటూ ప్రిన్సి పాల్ పేర్కొనగా మీదే బాధ్యత తోపాటు రాజీనామా ఉద్యోగానికి చేస్తారా అంటూ ప్రశ్నించారు.

చేస్తాను అంటూ సమాధానం చెప్పడంతో విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పడం కాదు రాసి ఇవ్వండి అంటూ నిలదీ శారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సు అనూష ఆందోళనకు దిగిన విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి వారిని శాంతింప చేశారు.  సంఘటనపై ఎస్సు స్పందిస్తూ మీరు దరఖాస్తు ఇస్తే కేసు నమోదు చేస్తామని వారికి హామీ ఇచ్చారు.

అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు విలేకరులతో మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయని కానీ ఇక్కడ ఎవరు బాధ్యత వహించడం లేదని, అందుకే మా పిల్లలకు ఇక్కడ భద్రతా లేదని పేర్కొన్నారు. ఇక్కడ చదివించాలంటేనే భయమేస్తుందని ఏ క్షణంలో ఏమి జరుగుతుందో తెలియటం లేదని మా పిల్లల భద్రత కంటే మాకు ఏది ముఖ్యం కాదని పేర్కొన్నారు. ఇక ఇక్కడ మా పిల్లలను చదివించలేమని తీసుకెళ్లడమే మాకు సరైన మార్గమన్నారు.