calender_icon.png 13 April, 2025 | 12:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉరి వేసుకుని బీహార్ కు చెందిన కూలీ ఆత్మహత్య

12-04-2025 11:32:17 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం నరసింహుల గూడెం గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు నిర్వహించే క్యాంపు వద్ద బీహార్ కు చెందిన కూలి మన్ జిత్ కుమార్ (22) చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రీన్ ఫీల్డ్ హైవే పనుల నిర్వహణలో పాల్గొనేందుకు బీహార్ రాష్ట్రంలోని వెస్ట్ చంపారన్ గౌహత్ల నుంచి మన్ జిత్ తన స్నేహితులతో కలిసి కూలి పనుల కోసం ఇక్కడికి వచ్చినట్లు నెల్లికుదురు చిర్రా రమేష్ బాబు తెలిపారు. మన్ జీత్ పది రోజుల నుండి ఇంటికి ఫోన్ చేస్తూ తరచుగా బాధపడుతున్నాడని కుటుంబ సమస్యల కారణంగా శనివారం చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. మృతుడి బంధువులకు సమాచారం అందించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.