calender_icon.png 11 January, 2025 | 3:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరదలో చిక్కుకున్న 20 మంది కూలీలు

18-07-2024 06:09:41 PM

నారాయణపురం: రాష్ట్రవ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట మండలం నారాయణపురం వద్ద వరదలో 20 మంది కూలీలు చిక్కుకున్నారు. పెదవాగు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు రావడంతో అధికారు గేట్లు ఎత్తారు. వరద నీటిని ప్రాజెక్టు దిగువ భాగంలో  ఒక్కసారిగా నీరు పోటెత్తింది.

దీంతో నారాయణపురం వద్ద కూలీలు వరదలో చిక్కుకుని సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ప్రమాదంపై స్పందించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బాధితులను రక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సంప్రదింపులు జరిపారు. హెలికాప్టర్ ద్వారా బాధితులను రక్షించాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో ఎన్డీఆర్ఎఫ్ బృందం, రెస్కూ టీమ్ సహాయ చర్యలు చేపట్టాయి.