కోరుట్ల, జనవరి 9: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ శివారులోని మాదాపూర్ కాలనీలోని శివరామకృష్ణ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లు నీటి సంపులో పడి కూలీ మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకా రం బీహార్ రాష్ట్రానికి చెందిన సచిన్ చౌదరి (38) బాయిలర్ కోసం ఉపయోగించే నీటి సంపు వద్ద కూర్చుని చూస్తున్నాడు. ప్రమాద వశాత్తు జారీ నీటి సంపులో పడి అక్కడిక క్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.