calender_icon.png 22 January, 2025 | 9:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మిక సంక్షేమానికి అధిక ప్రాధాన్యం

22-01-2025 07:11:11 PM

ఎఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ...

మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి యాజమాన్యం కార్మికుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని గుర్తింపు సంఘం ఎఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ అన్నారు. పట్టణంలోని మార్కెట్ 1వ జోన్ ఏరియాలో 1.10 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సింగరేణి యాజమాన్యం కార్మిక  సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తుందని దీనిలో భాగంగా కార్మిక కాలనీలలో మౌలిక వసతులు కల్పనకు కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా డివైజిఎం సివిల్ రాములు, సివిల్ అధికారి జయప్రకాష్, శ్రీహరి, యూనియన్ నాయకులు భీమనాథుని సుదర్శనం, పెద్దపెల్లి బానయ్య, ఎగ్గేటి రాజేశ్వరరావులు పాల్గొన్నారు.