calender_icon.png 19 April, 2025 | 11:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలి

16-04-2025 02:05:04 AM

రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లా దేవేందర్ రెడ్డి

యాదాద్రి భువనగిరి ఏప్రిల్ 15 ( విజయక్రాంతి ) : భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు లో కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లా దేవేందర్ రెడ్డి  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  మంగళవారం రోజున మోటకొండూరు మండల కేంద్రంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ లో జరిగిన భవన నిర్మాణ కార్మిక సంఘ 3వ మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ  ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న సంక్షేమ బోర్డు ఈరోజు సమస్యల నిలయముగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఏఐటియుసి నిరంతరం అండగా నిలిచి పోరాడుతుందని అన్నారు.  సీపీఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు మాట్లాడుతూ* కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ నిరంతరం రాజిలేనీ సమరశీల పోరాటాలు  నిర్వహిస్తుందని అన్నారు. పేరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెరగాలని అన్నారు. మల్లేష్, లింగయ్య, శ్రీరాములు ల అధ్యక్షతన జరిగిన ఈ మహాసభ లో ఏఐటీయూసీ జెండాను జిల్లా గౌరవ అధ్యక్షులు బోలగాని సత్యనారాయణ ఆవిష్కరించారు.

సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి,  జిల్లా గౌరవ అధ్యక్షులు బోలగాని సత్యనారాయణ, జిల్లా అధ్యక్షులు గోరేటి రాములు,  ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు  కళ్ళేం కృష్ణ, చెక్క వెంకటేష్, కుసుమని హరిచంద్ర, సిపిఐ మండల కార్యదర్శి గాదేగాని మాణిక్యం, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు పిల్లి శంకర్, జిల్లా సహాయ  కార్యదర్శులు బీరకాయల మల్లేష్, గానబోయిన వెంకటేష్, గోపగాని రాజు, భవన నిర్మాణ కార్మిక సంఘం  కొల్లూరి మల్లేష్, బోళ్ల శ్రీనివాస్, బోట్ల జహంగీర్, బోట్ల శ్రీను, వoగపల్లి నర్సింహా,  రైతు సంఘం జిల్లా కార్యదర్శి జక్క దయాకర్ రెడ్డి, ఏఐటీయూసీ కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, చేరాల లింగయ్య, పబ్బల రాజు, ముక్కెర్ల కొమురయ్య,  కందుకూరి దుర్యోధన్,  తదితరులు పాల్గొన్నారు