calender_icon.png 25 April, 2025 | 8:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలి

25-04-2025 12:00:00 AM

ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు

మంచిర్యాల, ఏప్రిల్ 24 : మేడేను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షులు మిట్టపల్లి పౌలు అధ్యక్షతన జరిగిన ఏఐటీయూసీ  జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. మేడే ఉత్సవాలను కార్మిక వర్గం ఘనంగా నిర్వహించాలని కోరారు. బ్రిటిష్ కాలం నుంచి సాధించుకున్న హక్కులను  కేంద్రంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కార్మికులకు హక్కులు లేకుండా చేస్తుందన్నారు. కార్మికుల హక్కులను చట్ట సవరణ ద్వారా 44 చట్టాలను 4 కోడ్‌లు గా విభజించి కార్మికులకు హక్కులు లేకుండా కార్పొరేట్లకు అనుకూలంగా కార్మిక చట్టాలను సవరణ చేయడం పూర్తిగా కార్మిక వర్గం వ్యతిరేకిస్తుందన్నారు.

44 కార్మిక చట్టాలను యధావిధిగా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనువరంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ ప్రభుత్వాల ఆధీనంలోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. జమ్ము కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి సంతాపం తెలియజేశారు. అనంతరం 139వ మేడే పోస్టర్‌లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు కలిందర్ అలీఖాన్, దాగం మల్లేష్, తోకల సరస్వతి పాల్గొన్నారు.