వీసంశెట్టి పూర్ణచందర్రావు...
పాల్వంచ (విజయక్రాంతి): వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు BKMU తెలంగాణ రాష్ట్రంలో పట్టాదారు పాసుబుక్ కలిగిన రైతు మరణిస్తే 5 లక్షల రూపాయలు రైతు బీమా కింద ఇస్తున్నారు. కానీ అదే వ్యవసాయంలో రైతులతో పాటు సమానంగా వ్యవసాయ కూలి పనులు చేస్తున్న వ్యవసాయ కార్మికులకు పని సమయంలో ప్రమాదం జరిగినా లేదా మరణించినా వారికి ఎటువంటి భీమా లేకపోవడం వలన వ్యవసాయ కార్మికులు చాలా నష్టపోతున్నారు. కనుక వ్యవసాయ కార్మికులకు కూడా వ్యవసాయ కార్మిక కూలి భీమా వర్తింపజేసి వ్యవసాయ కార్మికుడు మరణిస్తే 5 లక్షల రూపాయలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పాల్వంచ మండలం తోగ్గూడెం గ్రామంలో జరిగిన ప్రజా పాలన సభలో అడిషనల్ కలెక్టర్ హరి చందనకి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు నిమ్మల రాంబాబు, శనిగరపు శ్రీనివాస్, బాదావత్ శ్రీను, జరుపుల మోహన్, బాలకృష్ణ, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.