13-03-2025 02:03:38 AM
17న కార్మిక భవన్‌కు ఆర్టీసీ యాజమాన్యం, కార్మిక సంఘాలు
హైదరాబాద్ మార్చి 12 (విజయ క్రాంతి): ఈ ఏడాది జనవరి 27వ తేదీన ఆర్టీసీ యాజమాన్యానికి ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో 6 కార్మిక సంఘా లు సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో కార్మిక శాఖ ఇరు వర్గాలను మరోసారి చర్చలకు ఆహ్వానించింది. ఈనెల 17న ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న కార్మిక భవన్ లో సాయంత్రం 4 గంటలకు జరగనున్న చర్చలకు ఆర్టీసీ యాజమాన్యం, సమ్మె నోటీసు ఇచ్చిన కార్మి క సంఘాలను హాజరు కావాలంటూ కార్మిక శాఖ ఆహ్వానం అందించింది. గత నెల 10న కార్మిక శాఖ ఆర్టీసీ యా జమాన్యాన్ని చర్చలకు పిలిచినా ఎమ్మె ల్సీ కోడ్ సాకుగా చూపించి యాజమాన్యం చర్చలకు రాలేకపోయింది.