ఆర్టీసీ జేఏసీ డిమాండ్
హైదరాబాద్, సెప్టెంబర్ 2౩ (విజయక్రాంతి): 44 లేబర్ చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సెంట్రల్ లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు ఆర్టీసీ జేఏసీ ఆందోళన చేపట్టింది. జేఏసీ నాయకులు బ్లాక్ డే కార్యక్రమంలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సర్కులర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్ రెడ్డి, కార్మికులు ఈ నిరసనలో పాల్గొన్నారు.