calender_icon.png 3 April, 2025 | 3:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లేబర్ కార్డులను రెన్యువల్ చేసుకోవాలి

02-04-2025 12:23:47 AM

మహబూబాబాద్, ఏప్రిల్ 1 (విజయ క్రాంతి): లేబర్ కార్డులు ఉన్న కార్మికులు ఐదు సంవత్సరాల కాలపరిమితి అయిపోతున్న సందర్భంగా వారం రోజుల ముందు ప్రతి కార్మికుడు రెన్యువల్స్  చేయించుకోవాలని తెలంగాణ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ (సిఐటియు) జిల్లా అధ్యక్షులు కొండ ఉప్పలయ్య పిలుపునిచ్చారు. మరిపెడ పట్టణ కేంద్రంలోని స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికుల సమావేశం  కామెండ్ల వెంకన్న అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఉప్పలయ్య మాట్లాడానరు. సమావేశంలో మండల నాయకులు  కామెండ్ల వెంకన్న, సూరబోయిన బిక్షం, సుంకరి వెంకన్న, బల్లెం ఉప్పలయ్య, పోలపాక వెంకన్న, జినక సైదులు, వాసు, నాగరాజు, నవిల వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.