calender_icon.png 18 March, 2025 | 4:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లేబర్ కార్మికులకు ప్రతి ఒక్కరికి లేబర్ కార్డు తప్పనిసరి

17-03-2025 11:06:39 PM

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ పరిధిలోని భవన ఇతర నిర్మాణ రంగంలో పనిచేస్తున్న వారందరూ లేబర్ కార్డు తీసుకోండి దుబాస్ రాములు పిలుపు సోమవారం నాడు బాన్సువాడ సిపిఐ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. దీనిని ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ & కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) దుబాస్ రాములు మాట్లాడుతూ... బాన్సువాడ కార్మిక శాఖ పరిధిలోని, బాన్సువాడ బీర్కూర్ నస్రుల్లాబాద్, పిట్లం నిజంసాగర్, మహమ్మద్ నగర్, బిచ్కుంద, పెద్ద కొడప్గల్, మద్నూర్, డోంగ్లి, జుక్కల్, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్ తదితర మండలాలకు చెందిన భవన, ఇతర నిర్మాణారంగాలలో పనిచేస్తున్న కార్మికులందరూ తప్పనిసరిగా లేబర్ కార్డు చేసుకోవాలని ఆయన తెలిపారు.

లేబర్ కార్డు కొరకు బాన్సువాడ పట్టణ కేంద్రంలోని పాత బాన్సువాడలో గల లేబర్ యూనియన్ ఆఫీసుకు వచ్చి అప్లికేషన్ పెట్టుకోవాలని కార్మికులకు సహకరిస్తామని ఆయన తెలిపారు. వేలాదిమంది కార్మికులు కార్డు లేక బయట ఉన్నారని వీరందరూ తమ యూనియన్ కార్యాలయానికి వస్తే వారికి కార్మిక శాఖ అధికారి ద్వారా న్యాయం చేస్తామని ఆయన తెలిపారు. కార్మిక శాఖ ద్వారా గుర్తింపు పొందిన యూనియన్ ద్వారానే లేబర్ కార్డు చేసుకోవాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. రానున్న కాలంలో మన యూనియన్ చేసే పోరాటాలకు భవన నిర్మాణ కార్మికులు సంఘటితంగా ఐక్యంగా ఉండాలని ఆయన తెలిపారు. డెలివరీ మ్యారేజ్ డెత్  కు సంబంధించిన కుటుంబాలకు ఆర్థిక పరిహారం పెంపు కొరకు, కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధంగా ఉండాలని ఆయన తెలిపారు. ఈ ప్రెస్ మీట్ లో తోటపల్లి శ్రీనివాస్, కమ్మరి రాములు, ఆగమయ్య, సాయిలు తదితరులు పాల్గొన్నారు.