calender_icon.png 18 January, 2025 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లా పలొమా విల్లాస్ యజమానుల గోస

03-09-2024 12:34:13 AM

  1. రెండేళ్లుగా ప్రతి వానకాలం సీజన్‌లో వరద కష్టాలు 
  2. కోట్లు పెట్టికొని ఇబ్బంది పడుతున్నామంటున్న బాధితులు

చేవెళ్ల, సెప్టెంబర్ 2: శంకర్‌పల్లి మండలం మోకిలాలోని ‘లా పలొమా గేటెట్ కమ్యూనిటీ విల్లాలు ఇంకా వరద నీటిలో ఉన్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి చుట్టు పక్కల నుంచి వచ్చిన వరద నీరు కమ్యూనిటీని ముంచెత్తిన విషయం తెలిసిందే. కమ్యూనిటీ రోడ్లు, గ్రౌండ్ ప్లోర్లు జలమయం కావడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం కరెంట్ కూడా లేదని, రూ.కోట్లు పెట్టి విల్లా కొన్నా..

గోస తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాచా రం అందుకున్న అధికారులు సోమవారం వరద నీటిని మళ్లించేందుకు తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. జేసీబీతో కాల్వను తీయించి నీటిని దిగువకు పంపించారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య విల్లాలను సందర్శించారు. బాధితులతో మాట్లాడారు. విల్లాల పక్కనే ఉన్న మరో వెంచర్ నిర్వాహకులు నీరు పారేందుకు అడ్డంకిగా భారీ నిర్మాణాలు కడుతుండడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. 

33 ఎకరాల్లో.. 212 విల్లాలు..

లా పలొమా వెంచర్ 33 ఎకరాల్లో ఉంది. ఇక్కడ పార్కులు, స్విమ్మింగ్ పూల్, క్లబ్‌తో పాటు మొత్తం 212 విల్లాలు ఉన్నాయి. వెంచ ర్ వేసిన వారు ఒక్కో విల్లాను రూ.4 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు విక్రయించారు. ఇక్కడ ప్రస్తుతం వెయ్యి మంది నివాసం ఉంటున్నారు. రెండేళ్ల నుంచి వానకాలం సీజన్‌లో వరద సమస్య తలెత్తుతోంది. వెంచర్‌కు ఎగువన ఉన్న ఓ వెంచర్ నిర్వాహకులు నాలాను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం, డ్రైన్ సిస్టం లేకుండా భారీ నిర్మాణాలు చేపట్టడడమే వరదలకు కారణమైంది.