17-04-2025 08:03:41 PM
రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): క్యాతన్ పల్లి రైల్వే గేటు గురువారం నుంచి శాశ్వతంగా మూసివేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇటీవల క్యాతన్ పల్లి రైల్వే గేటుపై నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జిని స్థానిక ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ లు ప్రారంభించారు. అయితే రైల్వే గేటు గుండా వెళ్లే వాహనదారులకు ప్రత్యామ్నాయంగా ఫ్లైఓవర్ బ్రిడ్జిపై రాకపోకలు జరుగుతున్న తరుణంలో రైల్వే అధికారులు బుధవారం గేటును మూసివేస్తున్నట్లు గేటుకు పోస్టర్లు అతికించారు. కాగా గురువారం సాయంత్రం నుండి వాహనదారులు గేటు గుండా ప్రయాణించకుండా గేటు ముందు ఇనుప రాడ్లతో ఇరువైపులా శాశ్వతంగా మూసివేశారు.