calender_icon.png 28 March, 2025 | 4:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెరుచుకున్న క్యాతనపల్లి రైల్వే గేటు.. తీరిన కష్టాలు

21-03-2025 04:45:53 PM

మందమర్రి,(విజయక్రాంతి): రామకృష్ణాపూర్ పట్టణంలోని క్యాతనపల్లి రైల్వే గేటు(Kyathanpally Railway Gate) శుక్రవారం తెరుచుకుంది. రైల్వే ట్రాక్ లైన్ మరమ్మత్తులు(Railway Track Line Repairs) నిర్వహణ కోసం రైల్వే గేటును ఈ నెల 19 నుంచి 29 వరకు మూసి వేస్తున్నట్లు రైల్వే అధికారులు మార్చి 18న ఆదేశాలు జారి చేశారు. గత రెండు రోజులుగా రైల్వే గేట్ మూసి ఉండటంతో పట్టణ ప్రజలు మంచిర్యాలకు వెళ్లాలంటే అమరవాది, రాజీవ్ నగర్, హమాలివాడ మీదుగా మంచిర్యాలకు చేరుకొని తమ పనులు చేసుకున్నారు. ఇదిలా ఉండగా 10 రోజుల పాటు రైల్వే గేట్ మూసి వేస్తామని రైల్వే అధికారులు ప్రకటించినప్పటికీ 10వ తరగతి పరీక్షలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థుల ఇబ్బందులు తొలగించి రైల్వే గేటు కష్టాలు తీర్చాలని అధికారులు రైల్వే గేటు తెరిచినట్లు సమాచారం. పదో తరగతి పరీక్షల అనంతరం మరోసారి రైల్వే గేటు మూసివేసి ట్రాక్ పనులు చేపట్టే అవకాశం ఉన్నట్లు పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు.