18-03-2025 08:23:35 PM
మందమర్రి (విజయక్రాంతి): రామకృష్ణాపూర్ పట్టణంలోని క్యాతనపల్లి రైల్వే గేటును ఈనెల 19 నుంచి 29 వరకు మూసి వేస్తున్నట్లు రైల్వే అధికారులు మంగళవారం ఆదేశాలు జారీచేశారు. రైల్వే ట్రాక్ లైన్ మరమ్మత్తులు నిర్వహిస్తుండటంతో రైల్వే గేటును మూసి వేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. పట్టణ ప్రజలు రైల్వే అధికారులకు సహకరించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని తమ ప్రయాణాలు కొనసాగించాలని రైల్వే అధికారులు కోరారు.