బీఆర్‌ఎస్‌కు గ్రీన్‌కో 41 కోట్ల పార్టీ విరాళాలు
- అనుబంధ సంస్థలతో కలిసి 26 సార్లు రూ. 41 కోట్ల చందాలు
- వివరాలు బయటపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, జనవరి 6 (విజయక్రాంతి) : ఫార్ములా ఈ-కారు రేసు కేసు లో మరో ట్విస్ట్.. ఈ కేసులో సంచలన విషయాలను రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టింది. ఫార్ములా ఈ-కారు రేసు వ్యవ హారంలో క్విడ్ ప్రోకో జరిగినట్లుగా తేల్చింది, బీఆర్‌ఎస్‌కు రూ. 41 కోట్లను బాండ్ల రూపంలో గ్రీన్‌కో సంస్థ ముట్టజెప్పినట్లుగా వెల్లడించింది.
గ్రీన్ కో కంపెనీ ద్వారా బీఆర్‌ఎస్ పార్టీకి కోట్ల రూపాయల లబ్ధ్ది చేకూరినట్లు తెలిపింది. గ్రీన్‌కో, దాని అనుంబంధ సంస్థలు కలిసి 26 సార్లు మొత్తం రూ. 41 కోట్లు బీఆర్‌ఎస్ పార్టీకి చందాల రూపంలో ఇచ్చినట్లుగా వెల్లడించింది. రేసుకు సంబంధించిన చర్చలు మొదలయినప్పటి నుంచే ఎన్నికల బాండ్లను గ్రీన్‌కో సంస్థ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
2022 ఏప్రిల్ 8 నుంచి అక్టోబర్ 10వ తేదీ మధ్య గ్రీన్‌కో కంపెనీ బాండ్లను కొనుగోలు చేయగా, ప్రతిసారి రూ. కోటి విలువ చేసే బాండ్లను కొనుగోలు చేసినట్లుగా వెల్లడించడం సంచలనంగా మా రింది. దీంతో మొత్తం రూ. 41 కోట్లను ఎన్నికల బాండ్ల రూపంలో బీఆర్‌ఎస్‌కు గ్రీన్‌కో సంస్థ చెల్లింపులు చేసినట్లు తేలడంతో.. ఫార్ములా ఈథూ రేసు వల్ల బీఆర్‌ఎస్ పార్టీ లబ్ధి పొందినట్లు స్పష్టమైంది.
ఇదే అంశాన్ని సీఎం రేవంత్‌రెడ్డి సీపీఆర్వో బోరెడ్డి ఆయోధ్యరెడ్డి ‘ఫార్ములా రేసులో కొన్ని నిజాలు.. దీని భావమేని ‘తిరుకేషా’.. అంటూ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. గ్రీన్‌కో కంపెనీ దేశంలో పేరొందిన గ్రీన్ ఎనర్జీ సంస్థ. ప్రస్తుతం గ్రీన్‌కో కంపెనీకి డైరెక్టర్లుగా ఏపీకి చెందిన అనిల్ చలమలశెట్టి, మహే శ్ కొల్లి ఉన్నారు.
ఫార్మాలా ఈ-కారు రేస్ ప్రారంభానికి సుమారు నాలుగు నెలల ముందే గ్రీన్‌కో కంపెనీ రిజిస్టర్ కావడం పలు అనుమానాలకు తావిస్తోం ది. అంతేకాకుండా.. గ్రీన్‌కో కంపెనీ డైరె క్టర్లుగా ఉన్న అనిల్, మహేశ్‌లకు ఇంతకుముందు రేస్‌లు నిర్వహించిన ఎలాం టి అనుభవం లేకపోవడం గమనార్హం.
కాంగ్రెస్, బీజేపీకీ ఇచ్చారు: కేటీఆర్
హైదరాబాద్, జనవరి6(విజయ క్రాంతి): గ్రీన్‌కో సంస్థ ద్వారా బీఆర్‌ఎస్ పార్టీకి రూ. 41 కోట్ల లబ్ధ్ది చేకూరిందని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు స్పందించారు. 2022లో జరిగిన ఎన్నికల సందర్భంగా గ్రీన్‌కో ఎన్నికల బాండ్లు ఇచ్చిందని, 2023లో ఫార్ములా ఈ రేసు జరిగిందని తెలిపారు.
కాంగ్రెస్, బీజేపీకి కూడా గ్రీన్‌కో బాండ్లు ఇచ్చిందని తెలిపారు. ఫార్ములా ఈ-రేసు కారణంగా గ్రీన్‌కో నష్టపోయిందని, అందుకే మరుసటి ఏడాది స్పాన్సర్‌షిప్ నుంచి తప్పుకొన్నదని, అది క్విడ్ ప్రోకో ఎలా అవుతుందని కేటీఆర్ ప్రశ్నించారు. ఇది సీఎం రేవంత్‌రెడ్డి టీమ్ చేస్తున్న దుష్పచారమని కేటీఆర్ అన్నారు.
పార్లమెంట్ ఆమోదించిన ఎన్నికల బాండ్లు తీసుకుంటే అవినీతి ఎలా అవుతుంద న్నారు. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు వచ్చిన బాండ్లపై చర్చకు సిద్ధమా? అని కేటీఆర్ సవాలు విసిరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గ్రీన్‌కో 10 బాండ్లు ఇచ్చినట్లు బీఆర్‌ఎస్ వర్గాలు పేర్కొన్నాయి.
ఒక్కో బాండ్ విలువ రూ.10 లక్షలు కాగా, మొత్తం రూ.90 లక్షల బాండ్లను ఆ పార్టీ గ్రీన్‌కో నుం చి తీసుకున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో కాంగ్రెస్ పార్టీకీ 340 కంపెనీలు 1,351 కోట్ల రూపాయలను అందించినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.