calender_icon.png 4 October, 2024 | 6:48 PM

చట్టం తనపని తాను చేసుకుపోనిద్దాం: కేవీపీ

04-10-2024 03:59:54 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 3 పేజీల లేఖ రాశారు. కాంగ్రెస్ నేతగా ఎలాంటి మినహాయింపులు వద్దని పేర్కొన్న కేవీపీ సాధారణ పౌరుడి విషయంలో చట్ట ఎలా ఉంటుందో అలాగే వ్యవహరిస్తే చాలని ఆయన తెలిపారు. మీరు, నేను కలుగచేసుకోకుండా చట్టం తనపని తాను చేసుకుపోనిద్దాం అని కేవీపీ సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళన, సుందరీకరణను స్వాగతీస్తున్నా అని చెప్పారు. పార్టీ శ్రేయోభిలాషులు కొందరు మొదటి దశలో మూసీ ప్రక్షాళన చేయాలన్నారు.

రెండో దశలో సుందరీకరణ చేపడితే బాగుంటుందని మీకు సూచించాలని కోరారు. మూసీ సుందరీకరణపై మీ ఆసక్తి, సమర్థతను గమనించే మీ దృష్టికి తీసుకురాలేదన్నారు. రాష్ట్రంలోని పేదలకు నష్టంలేకుండా ప్రభుత్వం చేపడుతున్న అన్ని పనులను స్వాగతిస్తున్నాను, కానీ మనలోని కొందరు నేతలు తమ స్వార్ధాల కోసం విమర్శలు చేస్తున్నారని కేవీపీ చెప్పారు. మూసీ విషయంలో ప్రతిపక్షాలది మొసలి కన్నీరేనని, ప్రజలందరికీ తెలుసన్నారు. మీ ఆశయాన్ని దెబ్బతీసే కొందరి ప్రయత్నాలను తను ఖడిస్తున్నాని  కేవీపీ రామచంద్రరావు లేఖలో వెల్లడించారు.

అలాగే అజీజ్ నగర్ లో తన కుటుంబసభ్యుల ఫామ్ హౌస్ పై ఆరోపణలు చేస్తున్నారు. కొందరు నేతలు పని గట్టుకోని సీఎం రేవంత్ రెడ్డి భుజంపై తుఫాకీ పెట్టి తనను కాల్చి ఇరుకున పెట్టాలని చూస్తున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. సీఎంపై, కాంగ్రెస్ పార్టీపై ఆధారాల్లేని ఆరోపణలు చేస్తున్నారని, కేవీపీ మండిపడ్డారు. తన ఫామ్ హౌస్ లో ఒక అంగుళం ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్నట్లయితే కూల్చివేయమని చెప్పారు. సొంత ఖర్చులతో కూల్చిడానికి సిద్ధంగా ఉన్నట్లు గతంలోనే తను చెప్పానన్ని కేవీపీ గుర్తు చేశారు. తను, తన కుటుంబసభ్యులు ఇప్పటి వరకు కూడా ఆ మాటకు కట్టుబడి ఉన్నామని కేవీపీ రామచంద్రరావు పేర్కొన్నారు.