27-03-2025 08:56:02 PM
మంథని (విజయక్రాంతి): మంథని బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా కెవిఎల్ఎన్ హరిబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం మంథని బార్ అసోసియేషన్ ఎన్నికల నిర్వహించగా, అధ్యక్షులుగా కెవిఎల్ఎన్ హరిబాబు, ఉపాధ్యక్షులుగా కేతిరెడ్డి రఘోత్తంరెడ్డి, జాయింట్ సెక్రెటరీగా విజయ్ కుమార్, కోశాధికారిగా రాచర్ల రాజేందర్, లైబ్రరీ సెక్రెటరీగా శ్రీనివాస్, స్పోర్ట్స్ అండ్ కల్చర్ సెక్రటరీగా ఆర్ల నాగరాజు, కార్యవర్గ సభ్యులుగా సంతోష్, షబానాలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి పాపయ్య ఒక ప్రకటనలొ పేర్కొన్నారు.