calender_icon.png 21 February, 2025 | 9:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోంపురానికి 11కేవీ సబ్ స్టేషన్ మంజూరు

18-02-2025 12:32:33 AM

గద్వాల, ఫిబ్రవరి 17 ( విజయక్రాంతి ) :  కేటీ దొడ్డి మండలంలోని సోంపురం గ్రామంలో 11కేవీ సబ్ స్టేషన్‌ను ప్రభుత్వంతో మాట్లాడి గ్రామానికి సబ్ స్టేషన్ మంజూరు చేయించడం జరిగిందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు.

సోమవారం జిల్లా కేంద్రం లోని తన క్యాంపు కార్యాలయంలో సోంపురం, యర్సన్ దొడ్డి, సుల్తాంపురం గ్రామాల ప్రజలు, నాయకులకు సబ్ స్టేషన్ మంజూరుకు సంబందించిన  ప్రొసీడింగును ఎమ్మెల్యే అందచేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.... సబ్ స్టేషన్ నిర్మాణం కోసం  354.71  లక్షల నిధులు సైతం విడుదల చేయడం జరిగిందని ఎమ్మెల్యే వివరించారు. సి ఎం రేవంత్ రెడ్డి , విద్యుత్ శాఖ మరియు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు,  ఎమ్మెల్యే క్రిష్ణ మోహన్ రెడ్డి లకు సోంపురం, యర్సన్ దొడ్డి, సుల్తాన్ పురం గ్రామస్తులు,  రైతులు  ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.